News January 29, 2025
మహా కుంభమేళాకు విశాఖ నుంచి RTC సర్వీసులు

ఉత్తరప్రదేశ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాకు ఫిబ్రవరి 4,8,12 తేదీలలో విశాఖ నుంచి ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సులు ఏర్పాటు చేస్తున్నామని జిల్లా ప్రజా రవాణా అధికారి అప్పల నాయుడు తెలిపారు. ప్రయాగ రాజ్‌తో పాటు అయోధ్య, వారణాసి పుణ్యక్షేత్రాలను దర్శించుకునే విధంగా 7 రోజుల ప్రణాళికను రూపొందించారు. పూర్తి వివరాలకు www.apsrtconline.in వెబ్‌సైట్, బస్సు స్టేషన్‌లో బుకింగ్ కౌంటర్‌లో సంప్రదించాలన్నారు.
Similar News
News February 14, 2025
భూములు అన్యాక్రాంతం కాకుండా చూడాలి: కలెక్టర్

ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా రెవెన్యూ అధికారులు తగిన జాగ్రత్తలు వహించాలని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో అధికారులతో సమావేశం అయ్యారు. ప్రజల నుంచి వచ్చే వినతులకు సకాలంలో సమాధానం చెప్పాలన్నారు. సమస్యలను నిర్ణీత గడువులో పరిస్కరించాలని సూచించారు. ప్రభుత్వ భూములు, చెరువులు, కాలువల అన్యాక్రాంతాన్ని అవ్వకుండా చర్యలు చేపట్టాలన్నారు.
News February 14, 2025
వెంటనే ధ్రువీకరణ పత్రాలు అందజేయాలని ఆదేశం

బిడ్డ పుట్టిన వెంటనే జన్మ ధ్రువీకరణ పత్రాలను అందజేయాలని కేజీహెచ్ ఉన్నతాధికారులకు ఏపీ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు పద్మావతి ఆదేశాలు జారీ చేశారు. శుక్రవారం కేజీహెచ్‌లో అధికారులతో సమావేశమయ్యారు. 2024లో ఎంతమంది పిల్లలు జన్మించారు.. ఎంతమంది మరణించారో వివరాలు అడిగి తెలుసుకున్నారు. బిడ్డ పుట్టిన గది వద్దకు తప్పులు లేకుండా ధ్రువీకరణ పత్రాలు అందించాలని ఆదేశించారు.
News February 14, 2025
మల్కాపురం ఘటనలో ఆటో డ్రైవర్ మృతి

మల్కాపురంలోని ఇద్దరు ఆటోడ్రైవర్ల మధ్య జరిగిన వివాదంలో కత్తిపోట్లకు గురైన శామ్యూల్ KGHలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మల్కాపురం ఆటో స్టాండ్ వద్ద అప్పలరెడ్డికి శామ్యూల్ మధ్య స్వల్ప వివాదం చోటుచేసుకుంది. క్షణికావేశంలో అప్పలరెడ్డి తన వద్ద ఉన్న <<15456247>>కత్తితో శామ్యూల్‌ని <<>>పొడిచి తీవ్రంగా గాయపరిచాడు. KGHలో చేర్పించి ఆపరేషన్ చేసినప్పటికీ శామ్యూల్ మృతి చెందాడు. కాగా..నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.