News February 22, 2025
మహా కుంభాభిషేకానికి కేసీఆర్‌కు ఆహ్వానం

రేపు యాదగిరిగుట్ట స్వర్ణ విమాన గోపుర మహా కుంభాభిషేకానికి రావాలని మాజీ సీఎం కేసీఆర్‌ను ఆలయ పూజారులు కలిసి ఆహ్వానం అందించారు. అలాగే మార్చి 1 నుంచి 11 వరకు జరిగే బ్రహ్మోత్సవాల్లో పాల్గొనాలని కోరారు. ఆలయ ప్రధాన అర్చకులు వెంకటేశ్వరాచార్యులు, డీఈవో భాస్కర్, ముఖ్య అర్చకులు తదితరులు ఉన్నారు. కాగా, గతంలో పలు కార్యక్రమాలకు ఆహ్వానించినా కేసీఆర్ హాజరు కాలేదు. ఇప్పుడైనా వెళ్తారా అనేది చూడాలి.
Similar News
News November 18, 2025
సచివాలయాలకు పర్యవేక్షకులు వీరే..

AP: గ్రామ, వార్డు సచివాలయాలకు మండల స్థాయిలో పర్యవేక్షకులుగా 660 మంది డిప్యూటీ MPDOలను ప్రభుత్వం నియమించనుంది. అలాగే జిల్లా స్థాయిలో పర్యవేక్షకులుగా ZP CEO, డిప్యూటీ సీఈవో, జాయింట్ డైరెక్టర్ క్యాడర్ అధికారులకు బాధ్యతలు అప్పగించనుంది. నెలాఖరులోగా ఈ ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉంది. కాగా సచివాలయాలను 3 కేటగిరీలుగా విభజించిన విషయం తెలిసిందే. A కేటగిరీలో ఆరుగురు, Bలో 7, Cలో ఎనిమిది మంది ఉద్యోగులు ఉంటారు.

MLA కౌశిక్‌పై శ్రీశైలం యాదవ్ కామెంట్స్.. BRS ON FIRE

HZB MLA పాడి కౌశిక్ రెడ్డిపై జూబ్లీహిల్స్ MLA తండ్రి శ్రీశైలం యాదవ్ చేసిన కామెంట్స్‌పై స్థానికంగా చర్చ జరుగుతోంది. ఓ MLAపై శ్రీశైలం అలాంటి వ్యాఖ్యలు చేయడం గుండాయిజమేనని BRS నేతలు మండిపడుతున్నారు. ఎన్నికల్లో పోటీ చేయొద్దని, పోటీచేస్తే ఓడిపోతావని నవీన్‌తో కౌశిక్ అనడంపై ఓ ప్రైవేట్ ఇంటర్వ్యూలో శ్రీశైలం యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కౌశిక్‌కు జీవితం ఇచ్చిందే తామని, తను దెబ్బలు తింటే నవీన్ కాపాడాడన్నారు.