News February 25, 2025
మహా శివరాత్రి పుణ్య స్నానాలకు పటిష్ట ఏర్పాట్లు: కలెక్టర్

ఈ నెల 26న మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా పెద్దసంఖ్యలో భక్తులు కృష్ణానదిలో పుణ్య స్నానాలు ఆచరించి, దుర్గామల్లేశ్వర స్వామివార్లను దర్శించుకోనున్న నేపథ్యంలో ఆలయంతో పాటు ముఖ్య ప్రాంతాల్లో పటిష్ట ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ డా. జి.లక్ష్మీశ మంగళవారం తెలిపారు. రెవెన్యూ, పోలీస్, వీఎంసీ, మత్స్య, ఇరిగేషన్ తదితర శాఖల అధికారులకు ఏర్పాట్లపై మార్గనిర్దేశనం చేశారు.
Similar News
News February 26, 2025
నేనైనా లింగ వివక్షను ఎదుర్కోవాల్సిందే: జ్యోతిక

హీరో సూర్య భార్యగా తానూ లింగ వివక్షను ఎదుర్కొంటున్నట్లు నటి జ్యోతిక చెప్పారు. ‘సూర్యని పెళ్లి చేసుకున్నందుకు నేను అదృష్టవంతురాలినని ఏదైనా ఇంటర్వ్యూలో చెబితే ప్రజలు అతడు మంచివాడని అంటారు. నన్ను పెళ్లి చేసుకొని సూర్య సంతోషంగా ఉన్నాడని చెప్పినా అతడినే పొగుడుతారు. ఇందులో నేనెక్కడా కనిపించను. ఎందుకంటే సమాజం అలా చిత్రీకరిస్తుంది’ అని తాను నటించిన ‘డబ్బా కార్టెల్’ వెబ్ సిరీస్ ప్రమోషన్‌లో తెలిపారు.
News February 26, 2025
సుల్తానాబాద్ : ప్రేమ పేరుతో వేధించిన యువకుడికి జైలు

సుల్తానాబాద్ మండలంలోని పూసాలకు చెందిన యువకుడికి జైలుశిక్ష పడింది. మియాపూర్ గ్రామానికి చెందిన పదోతరగతి విద్యార్థినిని ప్రేమ పేరుతో ఇబ్బందికి గురిచేశాడని బాధితురాలు తండ్రికి తెలపడంతో అతడు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. వారు కేసు నమోదుచేసి కోర్టులో హాజరుపర్చారు. నేరం రుజువైనందున కోర్టు నెలరోజులు జైలుశిక్ష, రూ.1000 జరిమానా విధించింది.
News February 26, 2025
NTR: ఎమ్మెల్సీ పదవి రేసులో విజయవాడ కీలక నేత..?

2025 మార్చిలోపు రాష్ట్రంలోని అయిదుగురు ఎమ్మెల్సీల పదవీకాలం ముగియనుండటంతో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీల ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైంది. కాగా ఈ సారి విజయవాడకు చెందిన టీడీపీ నేత వంగవీటి రాధకు ఎమ్మెల్సీ పదవి దక్కనుందని పొలిటికల్ సర్కిల్‌లో టాక్ నడుస్తోంది. 2024 సార్వత్రిక ఎన్నికలలో రాధకు టికెట్ ఇస్తారని ప్రచారం జరిగినా చివరకు ఆయనకు టికెట్ దక్కకపోవడంతో ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇస్తారనే ప్రచారం ఊపందుకుంది.