News April 7, 2025
మహా సూర్య వందనం ఏర్పాట్లు పూర్తి: కలెక్టర్

మహా సూర్య వందనం ఏర్పాట్లు పూర్తయ్యాయని కలెక్టర్ దినేశ్ కుమార్ తెలిపారు. అరకు ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో నిర్వహించనున్న మహా సూర్య వందనం కార్యక్రమం ఏర్పాట్లను ఆదివారం పరిశీలించారు. విద్యార్థులు వివిధ పాఠశాలల వసతి గృహాల నుంచి బస్సులలో వేదిక వద్దకు తరలించడం జరుగుతుందన్నారు. అలాగే తిరిగి వేదిక నుంచి వసతి గృహాలకు క్షేమంగా సురక్షితంగా తరలించడానికి అన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవడం జరిగిందని తెలిపారు.
Similar News
News November 24, 2025
ప్రజా సమస్యలను పరిష్కరించాలి: కలెక్టర్

ప్రజా సమస్యలను పూర్తిస్థాయిలో విచారించి సానుకూలంగా పరిష్కరించాలని కలెక్టర్ వినోద్ కుమార్ చెప్పారు. సోమవారం బాపట్ల కలెక్టరేట్ వద్ద నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఆయన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ భావన తదితర అధికారులు పాల్గొన్నారు.
News November 24, 2025
పుట్టపర్తిలో ఉత్సవాలు బ్లాక్బస్టర్!

భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాలు గ్రాండ్ సక్సెస్ అయ్యాయి. ఈనెల 13న మొదలై 23న విజయవతంగా ముగిశాయి. లక్షలాది మంది భక్తులు, రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు వేడుకల్లో పాల్గొని బాబాను స్మరించుకున్నారు. ఉత్సవాల్లో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు, సంగీత కచేరీ, లేజర్ షో ఈవెంట్స్ భక్తులను మైమరపించాయి. జిల్లా అధికారులు, పోలీసులు, సాయి సేవాదళ్ సభ్యులు విశేష సేవలందించి శత జయంతిని సక్సెస్ చేశారు.
News November 24, 2025
MNCL: పరీక్ష ఫీజు షెడ్యూల్ విడుదల

2025- 26 సంవత్సరానికి టెక్నికల్ సర్టిఫికెట్ కోర్స్ (టీసీసీ) పరీక్ష ఫీజు షెడ్యూల్ విడుదలైంది. డ్రాయింగ్ లోయర్ గ్రేడ్ రూ.100, హయ్యర్ రూ.150, టైలరింగ్ అండ్ ఎంబ్రాయిడరీ లోయర్ రూ.150, హయ్యర్ రూ.200 పరీక్ష ఫీజు చెల్లించాలని మంచిర్యాల జిల్లా విద్యాశాఖాధికారి యాదయ్య తెలిపారు. అపరాధ రుసుం లేకుండా డిసెంబర్ 5 వరకు, అపరాధ రుసుం రూ.50తో 12వ తేదీ, రూ.75తో 19వ తేదీ వరకు ఫీజు చెల్లించాలని సూచించారు.


