News January 2, 2025
మహిళను కాపాడిన శ్రీశైలం పోలీసులు
శ్రీశైలంలోని రుద్రాక్ష మఠం వద్ద నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన యాలాల శ్వేతను శ్రీశైలం పోలీసులు కాపాడారు. అనంతరం వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. సీఐ ప్రసాదరావు తెలిపిన వివరాల మేరకు.. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నానికి చెందిన శ్వేత భర్తతో గొడవపడి శ్రీశైలానికి వచ్చి ఈ ఘాతుకానికి పాల్పడిందని అన్నారు. సమాచారం మేరకు తమ సిబ్బంది ఆమెకు చికిత్స అందించి, కుటుంబ సభ్యులకు అప్పగించారన్నారు.
Similar News
News January 22, 2025
రూ.291.67 కోట్లతో కర్నూలు నగరపాలక అంచనా బడ్జెట్
కర్నూలు నగరపాలక సంస్థ 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అంచనాల బడ్జెట్‌ను స్థాయీ సంఘం ఆమోదించింది. నగరపాలక కార్యాలయంలో మేయర్ బీవై రామయ్య అధ్యక్షతన స్థాయీ సంఘ సమావేశం బుధవారం నిర్వహించారు. రూ.291.67 కోట్లతో బడ్జెట్ రూపకల్పన చేశారు. మొత్తం ఆదాయం రూ.363.99 కోట్లు, ఖర్చు రూ.201.22 కోట్లు, రెవెన్యూ ఆదాయం రూ.201.22 కోట్లు, ప్రభుత్వ గ్రాంట్లు రూ.162.77 కోట్లు, మూలధన రాబడి రూ.138.69 కోట్లు.
News January 22, 2025
వచ్చే నెల 19 నుంచి శివరాత్రి బ్రహ్మోత్సవాలు
శ్రీశైల మహాక్షేత్రంలో వచ్చే నెల 19వ తేదీ నుంచి ప్రారంభమయ్యే శివరాత్రి బ్రహ్మోత్సవాలపై బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి, పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు. అందరి సమష్టి కృషితో బ్రహ్మోత్సవాలు విజయవంతం చేయాలని సమావేశంలో తీర్మానించారు.
News January 22, 2025
కర్నూలు: ముగ్గురు విద్యార్థుల మృతిపై పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి
కర్ణాటకలోని సింధనూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మంత్రాలయం వేద పాఠశాలకు చెందిన ముగ్గురు విద్యార్థులు, వాహన డ్రైవర్ మృతి చెందడంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. ‘ప్రమాద ఘటన తెలిసి దిగ్భ్రాంతికి లోనయ్యా. విద్యార్థులు హంపిలో ఆరాధనకు వెళ్తున్న సమయంలో ఈ దుర్ఘటన చోటుచేసుకోవడం బాధాకరం. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుంది’ అని ట్వీట్ చేశారు.