News February 4, 2025

మహిళను బెదిరించి డబ్బులు వసూలు..  నిందితుడు అరెస్ట్

image

నగ్న వీడియోలు బయటపెడతానని నిడదవోలుకు చెందిన మహిళను బెదిరించి డబ్బులు వసూలు చేసిన కేసులో నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ దేవకుమార్ తెలిపారు. మంగళవారం కొవ్వూరులో మీడియా సమావేశం నిర్వహించారు. నిందితుడు రూ.2కోట్ల 53 లక్షలు వసూలు చేశాడని చెప్పారు. బాధితురాలి ఫిర్యాదుతో నిందితుడిని అరెస్టు చేసి రూ.కోటి 81 లక్షల విలువ గల స్థిర, చర ఆస్తులు సీజ్ చేసినట్లు తెలిపారు.

Similar News

News November 21, 2025

తూ.గో. జిల్లాలో రేపటి నుంచి గ్రామసభలు: పీడీ

image

తూ.గో. జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలలో ఈ నెల 22న గ్రామ సభలు నిర్వహించాలని డ్వామా ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎం.నాగ మహేశ్వర రావు ఆదేశించారు. పారదర్శకతను పెంచడం, ప్రభుత్వ సేవలను గ్రామ స్థాయిలోనే ప్రజలకు అందుబాటులోకి తేవడమే ఈ సభల ముఖ్యోద్దేశమని తెలిపారు. ప్రజలు తప్పక హాజరై తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావాలని ఆయన కోరారు.

News November 21, 2025

రాజమండ్రి: ఆర్టీసీకి రూ.32 లక్షల ఆదాయం

image

కార్తీక మాసం నేపథ్యంలో ఆర్టీసీకి కాసుల పంట పండింది. కార్తీకం వేళ జిల్లాలో ఉన్న డిపోల నుంచి 36 బస్సులు నడపడం ద్వారా రూ.32 లక్షల ఆదాయం వచ్చిందని డీపీటీవో మూర్తి శుక్రవారం తెలిపారు. శబరిమలకు 8 బస్సులు, పంచారామాలకు 13 బస్సులు, ఏకాదశి రుద్రులు, నవ నందులు, శివ కేశవ దర్శిని, కోనసీమ స్పెషల్‌గా 15 బస్సులు నడిపామన్నారు. అయ్యప్ప భక్తుల కోసం, అలాగే ధనుర్మాసంలో బస్సులు నడిపేందుకు ఆర్టీసీ సిద్ధంగా ఉందన్నారు.

News November 21, 2025

తూ.గో: ‘రాజమౌళికి కాంగ్రెస్ అండగా ఉంటుంది’

image

సినీ దర్శకుడు రాజమౌళిపై కేసులు నమోదు చేయడం బీజేపీ అసహనానికి, సంకుచిత మనస్తత్వానికి నిదర్శనమని మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ మండిపడ్డారు. హనుమంతుడిపై రాజమౌళి చేసిన వ్యాఖ్యలను సాకుగా చూపి కేసులు పెట్టడాన్ని ఆయన తప్పుబట్టారు. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ తరఫున రాజమౌళికి పూర్తి మద్దతు ఇస్తున్నట్లు రాజమండ్రిలో తెలిపారు. తక్షణమే ఈ అర్థరహితమైన ఫిర్యాదులను వెనక్కి తీసుకోవాలని హర్షకుమార్ డిమాండ్ చేశారు.