News April 4, 2025
మహిళపై అత్యాచార యత్నం

మహిళపై ఓ వ్యక్తి అత్యాచారానికి యత్నించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సీఐ సతీశ్ వివరాల ప్రకారం.. తిర్లాపురానికి చెందిన ఓ మహిళ పొలం పనులు చేసుకుని ఇంటికి వెళ్తోంది. ఈ క్రమంలో వెంకన్న అనే వ్యక్తి అమె పై అత్యాచారయత్నం చేశాడు. ఎదురుతిరిగిన మహిళ ఈ విషయాన్ని ఆమె కుటుంబ సభ్యులకు తెలిపింది. వారు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.
Similar News
News April 5, 2025
రోహిత్ శర్మ నెక్స్ట్ మ్యాచ్ ఆడతారా?

మోకాలి గాయంతో నిన్న LSG మ్యాచుకు దూరమైన MI బ్యాటర్ రోహిత్ శర్మ తర్వాతి మ్యాచులోనూ ఆడే ఛాన్స్ కనిపించడం లేదు. ప్రాక్టీస్ సమయంలో ఆయన బ్యాటింగ్ చేయలేకపోయారని, మోకాలిపై బరువు మోపలేకపోతున్నారని కోచ్ జయవర్ధనే తెలిపారు. కోలుకునేందుకు ఆయనకు మరింత టైమ్ ఇస్తామన్నారు. ఎల్లుండిలోగా ఆయన కోలుకుంటే RCBతో మ్యాచులో ఆడతారని, లేదంటే ఈనెల 13న జరిగే DC మ్యాచుకు అందుబాటులోకి వస్తారని క్రీడా వర్గాలు తెలిపాయి.
News April 5, 2025
దిగ్వేశ్‌కు మళ్లీ ఫైన్.. ఈసారి ఏకంగా!

LSG బౌలర్ దిగ్వేశ్ రాఠీకి BCCI మళ్లీ <<15965200>>ఫైన్<<>> విధించింది. నిన్న MIతో మ్యాచ్‌లో వికెట్ తీసిన అనంతర మరోసారి ‘నోట్‌బుక్’ సెలబ్రేషన్ చేసుకోవడంతో <<15965793>>మ్యాచ్ ఫీజు<<>>లో 50% కోత, 2 డీమెరిట్ పాయింట్లు విధించింది. దిగ్వేశ్‌కు ఇలా ఫైన్ పడుతుండటంతో సీజన్ చివరకు వేలంలో వచ్చిన డబ్బు ఫైన్లు కట్టడానికే సరిపోతుందని మీమ్స్ పేలుతున్నాయి. మరోవైపు కెప్టెన్ పంత్‌కూ స్లోఓవర్ రేట్ కారణంగా రూ.12లక్షల ఫైన్ పడింది.
News April 5, 2025
400 ఎకరాల్లోకి ప్రవేశిస్తే చర్యలే..!: DCP

రాష్ట్రాన్ని కదిలించిన కంచ గచ్చిబౌలి 400 ఎకరాల భూవివాదంపై HYD మాదాపూర్ డీసీపీ వినీత్ కీలక నోటీసు జారీ చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాలు కఠినంగా అమలవుతాయని పేర్కొన్నారు. నేటి నుంచి ఏప్రిల్ 16 వరకు 400 ఎకరాల భూమిలో సంబంధిత పనులు కోసం ప్రవేశం నిషేధించినట్లు పేర్కొన్నారు. అతిక్రమిస్తే చట్టం ప్రకారం చర్యలు ఉంటాయని హెచ్చరించారు.