News February 11, 2025
మహిళలకు ఆరోగ్య సూత్రాలు వివరించాలి: డీఆర్డీఓ

మహిళా సంఘాల సభ్యులకు 10 ఆరోగ్య సూత్రాలు తెలపాలని డీఆర్డీఓ జ్యోతి అన్నారు. సంగారెడ్డిలో ఆరోగ్య సూత్రాలపై అవగాహన సమావేశం సోమవారం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. అవగాహన కల్పించేందుకు శిక్షణ సమావేశం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. సమావేశంలో అదనపు డీఆర్డీఓలు జంగారెడ్డి, బాల్ రాజ్, డీపీఎంలు మల్లేష్, జయశ్రీ తదితరులు పాల్గొన్నారు.
Similar News
News December 1, 2025
ఎయిడ్స్ నియంత్రణలో కామారెడ్డి జిల్లాకు ద్వితీయ స్థానం

కామారెడ్డి జిల్లాలో ఎయిడ్స్ నియంత్రణలో 2025-26 సంవత్సరానికి ద్వితీయ స్థానం లభించిందని ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. జిల్లాలో కామారెడ్డి ART సెంటర్ ద్వారా 2,570, బాన్సువాడ ART ద్వారా 1,411 మంది బాధితులకు వైద్య సేవలందుతున్నాయి. NGOల సహకారంతో, లింక్ వర్కర్ల సహాయంతో పాజిటివ్ కేసులు గుర్తిస్తున్నారు.
News December 1, 2025
తిరుమలలో సహస్ర నామార్చన ఆంతర్యం

తిరుమల శ్రీవారి ఆలయంలో తోమాలసేవ తర్వాత జరిగే ముఖ్య కైంకర్యం సహస్ర నామార్చన. ఇందులో స్వామివారిని 1008 నామాలతో పూజిస్తారు. ఈ నామాల ద్వారా శ్రీమహావిష్ణువు సకల వైభవాలను కీర్తిస్తారు. సకల దుఃఖాలను తొలగించేది, శుభాలను ప్రసాదించేది శ్రీమహావిష్ణువే అనే భావనతో ఈ అర్చన జరుగుతుంది. భక్తులు ఆర్జితసేవ టికెట్ల ద్వారా ఈ పవిత్రమైన అర్చనలో పాల్గొని, స్వామి అనుగ్రహాన్ని పొందవచ్చు. <<-se>>#VINAROBHAGYAMU<<>>
News December 1, 2025
NINలో ఉద్యోగాలు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రీషన్(NIN)లో 3 ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్-3, 2 పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. బీఎస్సీ(నర్సింగ్, న్యూట్రీషన్, డైటెటిక్స్, హోమ్ సైన్స్, పబ్లిక్ హెల్త్ న్యూట్రీషన్) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల వారు mmp_555@yahoo.comకు దరఖాస్తును పంపాలి. projectsninoutsourcing@gmail.comలో సీసీ పెట్టాలి. వెబ్సైట్: https://www.nin.res.in


