News February 18, 2025
మహిళలకు ఆశ్రయం ఇస్తాం: అనకాపల్లి SP

అనకాపల్లిలో సఖి వన్ స్టాప్ సెంటర్ను ఎస్పీ తుహీన్ సిన్హా సోమవారం సందర్శించారు. అతివలకు అండగా సఖి వన్ స్టాప్ సెంటర్ నిలుస్తుందని ఎస్పీ చెప్పారు. ఫిర్యాదు తీవ్రతను బట్టి సైకో సోషల్ కౌన్సిలింగ్, లీగల్ కౌన్సిలింగ్ ఇస్తామన్నారు. మహిళల సమస్యలను సత్వరం పరిష్కరించేందుకు దీనిని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అవసరమైన మహిళలకు ఈ సెంటర్లో 5 నుంచి 10 రోజుల వరకు ఆశ్రయం కల్పిస్తామన్నారు.
Similar News
News November 21, 2025
బ్లూ మీడియా ఆత్మవిమర్శ చేసుకోవాలి: దేవినేని ఉమా

ప్రజాస్వామ్యంలో పేదవాడైనా, సంపన్నుడైనా చట్టం ముందు అందరం సమానమేనని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరవు పేర్కొన్నారు. అక్రమాస్తుల కేసులో జగన్ రెడ్డి కోర్టుకు హాజరయ్యాడని చెప్పే దమ్ము, ధైర్యం బ్లూ మీడియాకు లేదని మండిపడ్డారు. అక్రమాస్తుల కేసులో కోర్టుకు వస్తున్నావని అభిమానం ఉప్పొంగిందా అంటూ ప్రశ్నించారు. పక్క రాష్ట్రాల్లో ఉండి ఏపీపై విషం చిమ్ముతున్న బ్లూ మీడియా ఆత్మవిమర్శ చేసుకోవాలని దుయ్యబట్టారు.
News November 21, 2025
తిరుపతి: ఆధార్ తప్పులతో ఆగిన ఆపార్..!

ఎన్ఈపీలో భాగంగా ఆధార్ లింక్తో విద్యార్థులకు ఆపార్ అందిస్తున్నారు. తిరుపతి జిల్లాలో 3,86,167 మంది ఉన్నారు. ఆపార్ వచ్చిన విద్యార్థులు 3,35,534 మంది కాగా.. పెండింగ్లో 50,633 మంది విద్యార్థులు ఉన్నారు. పదో తరగతి విద్యార్థులకు ఆపార్ నంబర్ తప్పనిసరి కావాల్సి ఉంది. ఇంటి పేర్లు, పుట్టిన తేదీల్లో ఎక్కువ శాతం తప్పులు ఉన్నాయి. ఇందుకోసం ప్రత్యేక ఆధార్ క్యాంపులు నిర్వహిస్తోంది.
News November 21, 2025
ఖమ్మం ప్రజలకు పోలీసుల విజ్ఞప్తి

‘లక్కీ డ్రా’ పేరుతో వచ్చే మోసాలను నమ్మి ప్రజలు నష్టపోవద్దని వన్ టౌన్ సీఐ కరుణాకర్ విజ్ఞప్తి చేశారు. ఇలాంటి వ్యక్తులు తారసపడితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. సమాచారం తెలిసిన వెంటనే డయల్-100కు లేదా సమీప పోలీస్ స్టేషన్కు ఫోన్ చేయాలని, వివరాలు తెలిపిన వారి ఫోన్ నంబర్లు గోప్యంగా ఉంచబడతాయని సీఐ తెలిపారు.


