News February 18, 2025
మహిళలకు ఆశ్రయం ఇస్తాం: అనకాపల్లి SP

అనకాపల్లిలో సఖి వన్ స్టాప్ సెంటర్‌ను ఎస్పీ తుహీన్ సిన్హా సోమవారం సందర్శించారు. అతివలకు అండగా సఖి వన్ స్టాప్ సెంటర్ నిలుస్తుందని ఎస్పీ చెప్పారు. ఫిర్యాదు తీవ్రతను బట్టి సైకో సోషల్ కౌన్సిలింగ్, లీగల్ కౌన్సిలింగ్ ఇస్తామన్నారు. మహిళల సమస్యలను సత్వరం పరిష్కరించేందుకు దీనిని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అవసరమైన మహిళలకు ఈ సెంటర్‌లో 5 నుంచి 10 రోజుల వరకు ఆశ్రయం కల్పిస్తామన్నారు.
Similar News
News March 23, 2025
ఐపీఎల్‌లో రోహిత్ శర్మ చెత్త రికార్డు

రోహిత్ శర్మ చెత్త రికార్డును మూటగట్టుకున్నారు. ఐపీఎల్‌లో అత్యధికసార్లు(18) డకౌటైన ప్లేయర్‌గా దినేశ్ కార్తీక్, మ్యాక్స్‌వెల్ సరసన చేరారు. ఆ తర్వాతి స్థానాల్లో సునీల్ నరైన్, పీయూష్ చావ్లా(16) ఉన్నారు. ఇవాళ చెన్నైతో మ్యాచ్‌లో 4 బాల్స్ ఆడిన హిట్ మ్యాన్ ఖలీల్ అహ్మద్ బౌలింగ్‌లో శివమ్ దూబేకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు వెళ్లారు.
News March 23, 2025
భద్రాద్రి జిల్లా నేటి ముఖ్యాంశాలు..!

✓ భద్రాద్రి రాములోరి కళ్యాణానికి హాజరుకానున్న సీఎం
✓ రేపు కలెక్టరేట్లో ప్రజావాణి
✓ జిల్లా వ్యాప్తంగా భగత్ సింగ్ వర్ధంతి
✓ ఐటిడిఏ ట్రైబల్ మ్యూజియం ప్రారంభోత్సవాన్ని అడ్డుకుంటాం:LHPS
✓ కొత్తగూడెం ఇఫ్తార్ విందులో పాల్గొన్న మంత్రి పొంగులేటి, ఎంపీ రామ సహాయం
✓ బెట్టింగ్ యాప్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి: సైబర్ క్రైమ్ సీఐ
✓ రుణమాఫీలో మంత్రి తుమ్మల మాట తప్పారు: రైతు సంఘం
✓ దమ్మపేటలో యువకుడు ఆత్మహత్య
News March 23, 2025
తుళ్లూరు: సీఎం పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్

ఈనెల 31 తేదీన అమరావతి రాజధాని ప్రాంతంలో పీ4 కార్యక్రమం ప్రారంభోత్సవంలో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో అందుకు సంబంధించిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి ఆర్డిఓ శ్రీనివాసరావుతో కలిసి పరిశీలించారు. సభా ప్రాంగణం వద్ద జరుగుతున్న పనులు పరిశీలించి అధికారులకు ఆమె సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక అధికారులు, డీఎస్పీ పాల్గొన్నారు.