News January 7, 2025
మహిళలకు ఇస్తామన్న రూ.2500 ఎక్కడ..?: హరీశ్ రావు

మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ప్రతినెల ఇస్తామన్న రూ.2500 ఇంకా ఎప్పుడు ఇస్తారని మాజీ మంత్రి హరీశ్ రావు ‘X’ వేదికగా ప్రశ్నించారు. ఎన్నికల ముందు హామీ ఇచ్చి గద్దెనెక్కి13 నెలలు అవుతున్నా సీఎం రేవంత్ రెడ్డి మహాలక్ష్మి పథకం ఊసే ఎత్తకపోవడం సిగ్గుచేటు అన్నారు. జార్ఖండ్లో సీఎంగా ప్రమాణం చేసిన హేమంత్ సోరెన్ నెల రోజులు కాకముందే ఇచ్చిన మాట ప్రకారం మహిళలకు రూ.2500 ఇస్తున్నారని తెలిపారు.
Similar News
News November 16, 2025
MDK: వాట్సప్ లింక్ ఓపెన్ చేస్తే డబ్బులు మాయం

తూప్రాన్ మండలానికి చెందిన ఓ వ్యక్తికి వచ్చిన వాట్సప్ లింక్ ఓపెన్ చేస్తే రూ.27,100 మాయమైనట్లు ఎస్ఐ శివానందం తెలిపారు. ఓ వ్యక్తికి 12న వాట్సాప్కు వచ్చిన యోనో యాప్ లింక్ ఓపెన్ చేసి ఇన్స్టాల్ చేశాడు. బ్యాంకు ఖాతాలో ఉన్న రూ.27,108 నుంచి, 27,100 డెబిట్ చేసినట్లుగా మెసేజ్ వచ్చింది. సైబర్ మోసానికి గురైనట్లు గుర్తించిన వ్యక్తి 1930 కాల్ చేసి, పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వివరించాడు.
News November 16, 2025
మెదక్: దరఖాస్తుల ఆహ్వానం

అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం డిసెంబర్ 3 పురస్కరించుకొని రాష్ట్రస్థాయిలో అందించే పురస్కారాలకు అర్హులైన వ్యక్తులు, సంస్థల నిర్వాహకుల నుంచి ఆన్ లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా సంక్షేమ అధికారి హేమ భార్గవి తెలిపారు. దరఖాస్తులను ఈనెల 17 వరకు https://wdsc.telangana.gov.in సమర్పించాలని సూచించారు.
News November 16, 2025
మెదక్ జిల్లాలో 503 కేసుల్లో రాజీ

మెదక్ జిల్లా వ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదైన రాజీ పడదగిన 503 కేసుల్లో రాజీ జరిగినట్లు జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాసరావు తెలిపారు. ఈరోజు నిర్వహించిన జాతీయ మేఘ లోక ఆదాలత్ కార్యక్రమంలో ఇరు వర్గాలను సమన్వయం చేస్తూ పరస్పర రాజీకి అనుకూలమైన వాతావరణం కల్పించి కేసులను పరిష్కరించడం జరిగిందన్నారు. సైబర్ నేరాల్లో 41 కేసుల్లో రూ.11,44, 608 తిరిగి ఖాతాల్లో జమ చేసినట్లు వివరించారు.


