News March 9, 2025

మహిళలకు ఏడాదికి రూ.21 వేల కోట్ల రుణాలు: భట్టి

image

మహిళలను అభివృద్ధిపథంలో నడిపించడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని Dy.Cm భట్టి విక్రమార్క తెలిపారు. మహిళా శక్తి సభలో Dy.Cm మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం డ్వాక్రా సంఘాల గురించి మర్చిపోయిందని మండిపడ్డారు. గత కాంగ్రెస్ పాలనలో డ్వాక్రా సంఘాలకు వడ్డీలేని రుణాలు ఇచ్చినట్లు చెప్పారు. ప్రస్తుత ప్రభుత్వం ఏడాదికి రూ.21వేల కోట్ల వడ్డీలేని రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు.

Similar News

News March 25, 2025

‘రైతులకు సాగు లాభాలు పెంచడమే లక్ష్యంగా పని చేయాలి’

image

రైతులకు సాగు లాభాలు పెంచడమే లక్ష్యంగా పని చేయాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. సోమవారం జిల్లా కలెక్టర్, వైరా కృషి విజ్ఞాన్ కేంద్రంలో నిర్వహించిన మధ్య తెలంగాణ మండల వ్యవసాయ పరిశోధన విస్తరణ సలహా సంఘం సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధిక మంది రైతులు వరిపై ఆధారపడడం మంచిది కాదని చెప్పారు. ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు.

News March 24, 2025

‘రాజీవ్ యువ వికాసం పథకాన్ని స్వదినియోగం చేసుకోండి’

image

ఏప్రిల్ 5లోపు రాజీవ్ యువ వికాసం పథకానికి బీసీ, ఈబీసీ, EWS నిరుద్యోగ యువత దరఖాస్తు చేసుకోవాలని ఖమ్మం జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారిణి జ్యోతి తెలిపారు. జిల్లాలోని వెనుకబడిన తరగతుల కులాలకు చెందిన నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు ద్వారా ఆర్థిక పురోగతి పెంపొందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిందని, దీనిని సద్వనియోగం చేసుకోవాలని కోరారు.

News March 24, 2025

విద్యార్థిని తండ్రి నిర్ణయం.. అధికారులను కదిలించింది..

image

ఓ విద్యార్థిని తండ్రి పట్టుదల కారణంగా ఓ స్కూల్‌ మూతపడకుండా నడుస్తోంది. వైరా మం. నారపునేనిపల్లి స్కూల్‌లో కోతుల బెడద, ఇతర కారణాలతో విద్యార్థులు వెళ్లిపోయారు. దీంతో స్కూల్‌ మొత్తంలో నాలుగో తరగతి విద్యార్థి కీర్తన మాత్రమే మిగిలింది. అధికారులు స్కూల్‌ను మూసివేసేందుకు యత్నించగా.. తన కుమార్తె చదువు మాన్పిస్తానని కీర్తన తండ్రి అనిల్‌శర్మ చెప్పారు. ఇందుకు అధికారులే బాధ్యత వహించాలనడంతో వెనక్కి తగ్గారు.

error: Content is protected !!