News October 23, 2024
‘మహిళలకు జీవిత బీమా పట్ల అవగాహన కల్పించాలి’

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 74 మండలాల్లోని మొత్తం 2013 గ్రామ సమైక్య సంఘాల పరిధిలో 40 వేల పైగా స్వయం సహాయక సంఘాలు ఉన్నాయి. వీటిలో 5 లక్షల మందిపైగా మహిళా సభ్యులు ఉన్నారు. గ్రామీణ మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి చిరు వ్యాపారాలు చేసుకోవడానికి రుణాలు అందజేయడంతో పాటు వారికి రూ.10 లక్షల బీమాను ప్రభుత్వం ఇస్తుంది. దీని పట్ల అవగాహన లేక పలువురు బీమాను కోల్పోతున్నారు. బీమాపై అవగాహన కల్పించాలని కోరుతున్నారు.
Similar News
News March 6, 2026
MBNR: ప్రజాపాలన -ప్రగతి ప్రణాళిక విజయవంతం చేయాలి

ప్రజా పాలని -ప్రగతి ప్రణాళిక విజయవంతం చేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజానర్సింహా పిలుపునిిచ్చారు. శుక్రవారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని ఐడీఓసీలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మార్చి 6 తారీకు నుంచి జూన్ 12 వరకు ఈ కార్యక్రమం ఉంటుందని పేర్కొన్నారు. 99 రోజులపాటు ఈ కార్యక్రమం కొనసాగుతుందన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే తదితరులు పాల్గొన్నారు.
News March 6, 2026
MBNR: యుద్ధం ఎఫెక్ట్.. పడిపోయిన కోడిగుడ్ల ధరలు!

ఉమ్మడి పాలమూరు జిల్లాలో కోడిగుడ్ల ధరలు రోజురోజుకు పడిపోతున్నాయి. NECC ఒక్క గుడ్డు ధర 4.30 ఉన్నప్పటికీ.. డిమాండ్ లేకపోవడంతో.. గుడ్డు ధర రూ.3.50 మాత్రమే పలుకుతోంది. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల మధ్య యుద్ధం జరుగుతుండడంతో కోడిగుడ్ల ఎగుమతి లేదని పౌల్ట్రీ ఫారం యజమానులు అన్నారు. యుద్ధం వల్ల ఎగుమతి లేకపోవడంతో నిల్వలు పెరిగాయన్నారు. యుద్ధం ఇలాగే కొనసాగితే పౌల్ట్రీ ఫారం రైతులు తీవ్రంగా నష్టపోతామన్నారు.
News March 6, 2026
MBNR: అధిక ఎండలు.. ప్రజల బెంబేలు

మహబూబ్ నగర్ జిల్లాలో గడిచిన 24 గంటల్లో.. చిన్న చింతకుంట మండలం నంది వడ్డేమాన్‌లో, కోయిలకొండ మండలం పారుపల్లిలో 38.5 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. భూత్పూర్ 38.4, చిన్న చింతకుంట 38.1, అడ్డాకుల 38.0, మిడ్జిల్ మండలం కొత్తపల్లి, భూత్పూర్ మండలం కొత్త మొల్గర 37.9, కౌకుంట్ల, కోయిలకొండ మండలం సిరి వెంకటాపూర్, మూసాపేట మండలం జానంపేట 37.8, దేవరకద్ర 37.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది.


