News March 8, 2025

మహిళలకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు: జనగామ కలెక్టర్

image

జనగామ జిల్లాలోని మహిళలకు, మహిళా ఉద్యోగులకు జిల్లా కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అన్ని రంగాల్లో మహిళల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించేందుకు, హక్కులపై వారికి అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టిందని పేర్కొన్నారు. మహిళా అభివృద్ధితోనే సమాజ అభివృద్ధి అని తెలిపారు.

Similar News

News April 12, 2026

చర్చలు విఫలం.. ఏం జరగబోతోంది?

image

అమెరికా-ఇరాన్ చర్చలు <<19629050>>విఫలం<<>> కావడంతో 14 రోజుల సీజ్‌ఫైర్ ముగిసిపోయే ప్రమాదం ఉంది. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ తీవ్రస్థాయిలో విరుచుకుపడే అవకాశం ఉంది. ఆ దేశంలోని న్యూక్లియర్, విద్యుత్, ఆయిల్ ప్లాంట్లను ధ్వంసం చేయవచ్చు. అటు ఇరాన్ గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలు, చమురు క్షేత్రాలు, రిఫైనరీ ప్లాంట్లను టార్గెట్ చేసుకొని అటాక్ చేసే ఛాన్స్ ఉంది. హార్ముజ్ జలసంధిని ఇరాన్ పూర్తిగా మూసివేయవచ్చు.

News April 12, 2026

MHBD: విషాదం.. ఈతకు వెళ్లి ఇద్దరు బాలికలు మృతి

image

ఈతకు వెళ్లిన ఇద్దరు చిన్నారులు మృతి చెందిన విషాద ఘటన మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలో శనివారం జరిగింది. మట్వాడ శివారు నీలవంచకు చెందిన చిన్నారులు శ్రీజ(9), చైత్ర(9) చెరువు వద్దకు ఈతకు వెళ్లారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు చెరువులో మునిగి చనిపోయినట్లు స్థానికులు తెలిపారు. చిన్నారుల మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలముకొన్నాయి.

News April 12, 2026

MLG: విద్యుత్ షాక్‌తో మహిళా రైతు మృతి

image

మిర్యాలగూడ మండలం తక్కెళ్లపాడులో విషాదం నెలకొంది. ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురై ఎదురుగట్ల శంకరమ్మ (35) అనే మహిళ మృతి చెందారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. శంకరమ్మ మృతితో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి.