News March 18, 2025

మహిళలకు రక్షణగా శక్తి యాప్: జిల్లా ఎస్పీ

image

మహిళలకు శక్తి యాప్ అండగా ఉంటుందని జిల్లా ఎస్పీ తుషార్ డూడి తెలిపారు. ఈ సందర్భంగా పోలీసు సిబ్బంది రైల్వేస్టేషన్, బస్టాండ్‌లో మహిళలకు శక్తి యాప్ ప్రాముఖ్యతను వివరించారు. ఫోన్‌లో శక్తి యాప్ ఉంటే ఆపద సమయాల్లో రక్షణగా ఉంటుందని అన్నారు. కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Similar News

News January 2, 2026

రోహిత్ శర్మ ‘పీపుల్స్ కెప్టెన్’: MSK ప్రసాద్

image

రోహిత్ శర్మ ‘పీపుల్స్ కెప్టెన్’ అని మాజీ చీఫ్ సెలక్టర్ MSK ప్రసాద్ అన్నారు. ‘ధోనీ, కోహ్లీల కాంబినేషన్ రోహిత్. వారిద్దరి నుంచి మంచి క్వాలిటీలను తీసుకుని కెప్టెన్‌గా ఎదిగారు. ధోనీ నుంచి కూల్‌నెస్, విరాట్ నుంచి దూకుడు అందిపుచ్చుకుని తనదైన శైలిలో జట్టును నడిపించారు. యంగ్ క్రికెటర్లతో రోహిత్ చాలా సరదాగా ఉంటూ ఫలితాలు రాబట్టారు’ అని ఓ పాడ్‌‍కాస్ట్‌లో వివరించారు.

News January 2, 2026

KMR: ఈ నెల 3న జాబ్ మేళా

image

కామారెడ్డిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ నెల మూడో తేదీన జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ఇంటర్ నోడల్ అధికారి షేక్ సలాం చెప్పారు. బీపీఓ పోస్టులకు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అర్హులైన వారు జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

News January 2, 2026

ఈడుపుగల్లుకు రైలు కూత.. 49 కి.మీ కొత్త రైల్వే లైన్

image

తరిగొప్పుల-దుగ్గిరాల మధ్య ప్రతిపాదిత 49k.m కొత్త రైల్వే లైన్‌లో ఈడుపుగల్లు రైల్వేస్టేషన్ కేంద్రంగా మారనుంది. లొకేషన్ సర్వే, మట్టి నమూనాల పరిశీలన పూర్తికావడంతో భూసేకరణ, ట్రాక్‌, స్టేషన్ నిర్మాణాలకు త్వరలో టెండర్లు పిలవనున్నారు. తరిగొప్పుల నుంచి చీలి, మంతెన దక్షిణంగా రైవాస్ కాలువ మీదుగా ఈడుపుగల్లు,వణుకూరు వైపు ట్రాక్‌ వెళ్లనుంది. చోడవరం వద్ద రైల్వే కమ్ రోడ్డు బ్రిడ్జి నిర్మాణానికీ కసరత్తు సాగుతోంది.