News March 19, 2025

మహిళలకు రక్షణగా శక్తి యాప్: జిల్లా ఎస్పీ

image

మహిళలకు శక్తి యాప్ అండగా ఉంటుందని జిల్లా ఎస్పీ తుషార్ డూడి తెలిపారు. ఈ సందర్భంగా పోలీసు సిబ్బంది రైల్వేస్టేషన్, బస్టాండ్‌లో మహిళలకు శక్తి యాప్ ప్రాముఖ్యతను వివరించారు. ఫోన్‌లో శక్తి యాప్ ఉంటే ఆపద సమయాల్లో రక్షణగా ఉంటుందని అన్నారు. కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Similar News

News November 16, 2025

షాద్‌నగర్: ‘నిందితులను తక్షణమే అరెస్టు చేయాలి’

image

షాద్‌నగర్ సమీపంలోని ఎల్లంపల్లి గ్రామ యువకుడు రాజశేఖర్ హత్యను బహుజన్ సమాజ్ పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ ఖండించారు. ఆయన మాట్లాడుతూ.. రాజశేఖర్‌ను కిడ్నాప్ చేసి హత్య చేసిన నిందితులను తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. హత్యకు ముందు మృతుడిని నిందితులు కిడ్నాప్ చేస్తే కుటుంబ సభ్యులు 100 ద్వారా పోలీసులకు సమాచారం ఇచ్చినా ఎందుకు రక్షించలేదని ప్రశ్నించారు.

News November 16, 2025

ICDS అనంతపురంలో ఉద్యోగాలు

image

ఏపీ: అనంతపురం జిల్లాలోని మహిళాభివృద్ధి& శిశు సంక్షేమశాఖ వన్ స్టాప్ సెంటర్‌ 4 కాంట్రాక్ట్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. సైకో-సోషల్ కౌన్సెలర్, మల్టీ పర్పస్ స్టాఫ్, సెక్యూరిటీ గార్డ్ పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో డిగ్రీ/సైకాలజీ డిప్లొమా/న్యూరో సైన్స్, టెన్త్ అర్హతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు ఈ నెల 25వరకు అప్లై చేసుకోవచ్చు. వెబ్‌సైట్: https://ananthapuramu.ap.gov.in/

News November 16, 2025

చీర కట్టినప్పుడు పొడవుగా కనిపించాలంటే..

image

కాస్త ఎత్తు తక్కువగా ఉన్నవారు కొన్ని టిప్స్ పాటిస్తే చీర కట్టుకున్నప్పుడు పొడవుగా కనిపిస్తారు. మృదువైన సిల్కు ప్లెయిన్ చీర చిన్న అంచు ఉన్నది ఎంచుకోవాలి. పైట పొడవుగా ఉండి, చీర కింది అంచులు నేలకు తగిలేలా ఉండాలి. డీప్ నెక్ బ్లౌజ్‌కు ప్రాముఖ్యతనివ్వాలి. సింపుల్గా పొడవైన హారాలు బాగుంటాయి. పెద్ద పెద్ద బోర్డర్లున్న చీరలు, పెద్ద ప్రింట్స్ ఉన్నవి ఎంచుకోకూడదు. హైనెక్, క్లోజ్ నెక్‌కు దూరంగా ఉండాలి.