News April 12, 2025
మహిళలతో అమర్యాదగా ప్రవర్తిస్తే కేసులే: ఎస్పీ

సోషల్ మీడియా మాధ్యమాలలో ఇతరుల వ్యక్తిగత ప్రతిష్ఠకు భంగం కలిగించేలా మాట్లాడితే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ ఏఅర్.దామోదర్ శనివారం హెచ్చరించారు. మహిళలపై ఫోన్లలో, సోషల్ మీడియా మాధ్యమాలలో అసభ్యకరమైన పదజాలంతో మాట్లాడినా, పోస్టులు పెట్టినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మహిళలతో అమర్యాదగా ప్రవర్తిస్తే కేసులు నమోదు చేస్తామని ఎస్పీ పేర్కొన్నారు.
Similar News
News April 15, 2025
ప్రకాశం: AB వెంకటేశ్వరరావుపై వైసీపీ ఎమ్మెల్యే ఫైర్

AB వెంకటేశ్వరరావుపై వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ట్విట్టర్(ఎక్స్) వేదికగా సోమవారం ఫైర్ అయ్యారు. “జగన్‌ని హత్యచేయాలన్న పన్నాగంతోనే శ్రీనివాస్ దాడికి పాల్పడినట్టుగా ఛార్జ్ షీట్‌లో ఎన్‌ఐఏ చెప్పిన విషయం AB వెంకటేశ్వరరావు మరిచిపోయారా అని ప్రశ్నించారు. జగన్‌పై దాడి చేసిన సమయంలో డీజీపీగా ఉన్న ఠాకూర్‌కి, ఇంటలిజెన్స్ చీఫ్‌గా ఉన్న మీకు నామినేటెడ్ పోస్టులు ఎలా వచ్చాయ్? అంటూ ప్రశ్నించారు.
News April 15, 2025
బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ దామోదర్

తాళ్లూరు మండలం సోమవారపాడు, తూర్పు గంగవరంలోని గుంటి గంగాభవాని అమ్మవారి తిరుణాళ్ల సందర్భంగా ఏర్పాటుచేసిన పోలీస్ బందోబస్తును సోమవారం రాత్రి జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ పరిశీలించారు. తిరుణాళ్లలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గట్టిగా ఏర్పాటు చేశామన్నారు. అమ్మవారిని దర్శించుకునే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని పోలీసులకు సూచించారు.
News April 15, 2025
ప్రకాశం జిల్లాలో ఇద్దరి మృతి

ప్రకాశం జిల్లాలో సోమవారం జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాలలో ఇద్దరు మృతి చెందారు. మార్కాపురం మండలం రాయవరం బ్రిడ్జిపై బైక్ అదుపు తప్పడంతో ఈదా కాశి అనే యువకుడు మృతి చెందగా, మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. గిద్దలూరు మండలంలోని ముండ్లపాడు వద్ద రెండు బైకులు ఎదురుగా ఢీకొనడంతో కడప జిల్లాకు చెందిన పెద్ద ముస్తఫా అనే వ్యక్తి మృతి చెందాడు.