News April 4, 2025
మహిళలపై అఘాయిత్యాలు.. CM ఏంచేస్తున్నారు: RSP

శాంతి భద్రతలు కాపాడడంలో రేవంత్ సర్కార్ విఫలమైందని BRS నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు. మేడ్చల్ MMTS రైలులో యువతిపై అత్యాచారయత్నం, సంగారెడ్డి కందిలో భర్తను కట్టేసి మహిళపై అత్యాచారం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇన్ని జరుగుతుంటే ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నించారు. స్వయంగా సీఎం హోంమంత్రిగా ఉన్నప్పటికీ ఇన్ని అఘాయిత్యాలు జరగటం ఏంటని ప్రశ్నించారు.
Similar News
News November 24, 2025
MHBD ఎంప్లాయిమెంట్స్ కార్యాలయంలో జాబ్ మేళా

మహబూబాబాద్ జిల్లా ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో, క్రెడిట్ ఆక్సెస్ గ్రామీణ్ లిమిటెడ్, కంపెనీలో కేంద్ర మేనేజర్ ఉద్యోగాల ఎంపికకై జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఉపాధి కల్పన అధికారి రజిత తెలిపారు. అర్హత కల్గిన నిరుద్యోగ అభ్యర్థులు ఈనెల 26న ఉదయం సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో రెజ్యూమ్, సర్టిఫికెట్లతో హాజరై ఈ అవకాశాన్ని సద్వినియోగ పరుచుకోవాలని ఆమె కోరారు.
News November 24, 2025
కాలుష్యాన్ని నెట్ జీరో స్థాయికి తగ్గించాలి: CM

AP: అన్ని రకాల ప్లాస్టిక్ వ్యర్థాలను డిస్పోజ్ చేసేందుకు ఓ విధాన నిర్ణయం తీసుకోవాలని CM చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ‘కాలుష్యాన్ని నెట్ జీరో స్థాయికి తగ్గించాలి. సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ వినియోగం తగ్గించాలి. బయో వేస్ట్ డిస్పోజల్స్ విషయంలో ఏ మాత్రం నిర్లక్ష్యం వహించొద్దు. 15,526 హెల్త్ కేర్ ఫెసిలిటీస్ ద్వారా వచ్చే బయో వ్యర్థాలను 48 గంటల్లోగా డిస్పోజ్ చేయాల్సిందే’ అని స్పష్టం చేశారు.
News November 24, 2025
డ్రగ్స్ కేసుల్లో గత 16 నెలల్లో 2,467 మంది అరెస్ట్: DIG

గత 16 నెలల్లో 2,467 మంది డ్రగ్స్ కేసుల్లో అరెస్ట్ అయినట్లు రేంజ్ డీఐజీ గోపీనాథ్ జట్టి తెలిపారు. విజయనగరంలో సోమవారం జరిగిన అభ్యుదయం సైకిల్ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. డ్రగ్స్ వలన కుటుంబాలు, భవిష్యత్తు, వ్యక్తిత్వం పూర్తిగా దెబ్బతింటుందని, గంజాయి లేదా డ్రగ్స్ వినియోగం, రవాణా, అమ్మకం ఏదైనా చేస్తే జైలుశిక్ష తప్పదన్నారు. మాదక ద్రవ్యాల నిర్మూలనకు 1000 కి.మీ ‘అభ్యుదయం సైకిల్ ర్యాలీ’ చేపట్టామన్నారు.


