News March 8, 2025

మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలి : మంత్రి ఫరూక్

image

మహిళలు ఆర్థిక పరిపుష్టి సాధించి అన్ని రంగాల్లో ముందంజ వేయాలన్నది కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి మహ్మద్‌ ఫరూక్‌ పేర్కొన్నారు. నెల్లూరు నగరంలోని కస్తూర్భా కళాక్షేత్రంలో జిల్లా కలెక్టర్‌ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి ఫరూక్‌, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి హాజరయ్యారు. మహిళలను ఉద్దేశించి మంత్రి మాట్లాడారు.

Similar News

News April 22, 2025

పరారీలోనే కాకాణి..దక్కని రిలీఫ్

image

క్వార్ట్జ్ అక్రమ మైనింగ్ కేసులో వైసీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి ఇంకా పరారీలోనే ఉన్నారు. ఆయనకు బెయిల్ దక్కకపోవడంతో అజ్ఞాత వాసం కొనసాగిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ కేసులో బెయిల్ ఇచ్చేందుకు సోమవారం హైకోర్టు నిరాకరించింది. బెయిల్ పిటీషన్ విచారణ పరిధిని తేల్చే అంశాన్ని ధర్మాసనం ముందుపెట్టింది. మరోవైపు కాకాణి ఆచూకీ కోసం పోలీసు బృందాలు వివిధ రాష్ట్రాల్లో ముమ్మరంగా గాలిస్తున్నాయి.

News April 22, 2025

నిర్లక్ష్యంగా ఉంటే కఠిన చర్యలు: నెల్లూరు కలెక్టర్

image

భూ సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యంగా ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామని నెల్లూరు కలెక్టర్‌ ఆనంద్‌ అధికారులను హెచ్చరించారు. కలెక్టరేట్‌లో ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. వివిధ సమస్యలపై ప్రజలు అందించిన అర్జీలను జాప్యం లేకుండా వెంటనే పరిష్కరించేందుకు ఆయా శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. భూసమస్యలు, రెవెన్యూ అంశాలకు సంబంధించి ఫిర్యాదులు వచ్చాయన్నారు.

News April 21, 2025

చట్టపరంగా న్యాయం చేస్తాం: నెల్లూరు ఎస్పీ

image

నెల్లూరులోని జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ డే నిర్వహించారు. మొత్తం 119 ఫిర్యాదులు వచ్చాయి. వీటిపై త్వరితగతిన స్పందించి పరిష్కరించాలని పోలీసు అధికారులను ఎస్పీ కృష్ణకాంత్ ఆదేశించారు. బాధితుల అర్జీలపై విచారణ జరిపి చట్టపరంగా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.

error: Content is protected !!