News March 9, 2025

మహిళలు ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలి: హోం మంత్రి

image

సమాజంలో మహిళలు ఎప్పుడూ మహారాణులు గానే నిలుస్తారని రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనితా అన్నారు. ఆదివారం ఏపీ గవర్నమెంట్ నర్సింగ్ అసోసియేషన్ అధ్యక్షురాలు గంగాభవాని, కార్యదర్శి వరలక్ష్మి ఆధ్వర్యంలో ఆంధ్ర మెడికల్ కళాశాల సమావేశ మందిరంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్యక్రమంలో హోం మంత్రి అనిత ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మహిళలు ఎప్పుడో మహారాణులుగా నిలుస్తారన్నారు.

Similar News

News March 10, 2025

విశాఖ హోటల్‌లో మహిళ మృతి.. నిందితుడు అరెస్ట్

image

విశాఖలోని ఓ హోటల్‌లో <<15698756>>మహిళ ఉరి<<>> వేసుకున్న ఘటనలో నిందితుడిని త్రీటౌన్ పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. విశాఖలో ఉంటున్న పిళ్ల శ్రీధర్ (53)USAలో ఫ్రీలాన్సర్‌గా పనిచేస్తున్నారు. అక్కడ ఓ మహిళతో పరిచయం ఏర్పడింది. ఆమె ఫిబ్రవరి 14న విశాఖ వచ్చింది. మార్చ్ 6న హోటల్ మేఘాలయలో కలవాలని అతను బలవంతం చేశాడు. హోటల్‌లో శ్రీధర్ ఆమెను ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించాడని దీంతో ఆమె ఉరి వేసుకుందని విచారణలో తేలింది.

News March 10, 2025

విశాఖలో నేటి కూరగాయ ధరల వివరాలు

image

విశాఖలోని వ్యవసాయ, వాణిజ్య శాఖ అధికారులు సోమవారం నాటి కూరగాయ ధరలను విడుదల చేశారు. వాటి వివరాలు టమోటా కేజీ రూ.14 , ఉల్లిపాయలు కేజీ రూ.28 , బంగాళాదుంపలు కేజీ రూ.15, వంకాయలు రూ.22/24/32, బెండకాయలు రూ.44, మిర్చి రూ.24, బరబాటి రూ.36, క్యారెట్ రూ.24, బీరకాయలు రూ.50, వెల్లుల్లి రూ.60/80/90గా నిర్ణయించారు.

News March 10, 2025

వారిని కూడా త్వరలో అరెస్టు చేస్తాం: విశాఖ సీపీ

image

విశాఖ సీపీ ఆదేశాల మేరకు టాస్క్‌ఫోర్స్, సైబర్ క్రైమ్ పోలీసులు ఇప్పటికే ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్ ముఠాను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి వచ్చిన సమాచారంతో అల్లిపురానికి చెందిన ప్రధాన నిందితుడు నానాబల్ల గణేశ్వరరావును ఆదివారం అరెస్ట్ చేశారు. ఇతను మధ్యవర్తిగా బెట్టింగ్ లావాదేవీలు జరపుతుంటాడని పేర్కొన్నారు. వీరి ద్వారా ఇంకొందరు బుకీల సమాచారం వెలుగులోకి వచ్చిందని వారిని త్వరలో అరెస్ట్ చేస్తామన్నారు.

error: Content is protected !!