News May 4, 2024

మహిళలు, బాలికలను వేధిస్తే కఠిన చర్యలు: జిల్లా ఎస్పీ చందనా దీప్తి

image

నల్గొండ జిల్లా షీ టీం బృందాలు మహిళా రక్షణలో ముందుంటూ ఎలాంటి ఆపద వచ్చిన వెంటనే స్పందిస్తూ రక్షణ కల్పిస్తుందని జిల్లా ఎస్పీ స్పందన దీప్తి తెలిపారు. మహిళలను, యువతులను వేధిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లా వ్యాప్తంగా షీ టీం బృందాలు అన్ని ప్రాంతాలలో డేగ కళ్ళతో పర్యవేక్షిస్తున్నాయని తెలిపారు. మహిళలు, యువతులు, బాలికలను ఎవరైనా లైంగికంగా వేధించిన, ఈవ్ టీజింగ్ పాల్పడిన కఠిన చర్యలు తప్పవన్నారు.

Similar News

News November 29, 2025

నల్గొండ: పంచాయతీ ఎన్నికలు.. ఇదీ పరిస్థితి..!

image

పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో నల్గొండ జిల్లాలోని పలు చోట్ల ఏకగ్రీవం చేసేందుకు ప్రధాన పార్టీల నాయకులు చూస్తున్నారు. ఇందుకు బుజ్జగింపులు, నగదు, పదవీ ఆశలు చూపుతూ పోటీ చేద్దామనుకునే వారిని తమ నిర్ణయం వెనక్కి తీసుకునేలా చేస్తున్నారు. ఇక పలు చోట్ల సర్పంచ్ పదవి కోసం వేలం పాటలు నిర్వహిస్తున్నారు. ఎవరు ఎక్కువ పాడితే వారినే ఏకగ్రీవంగా ఎన్నుకుంటున్నారు. అయితే ఇది నిబంధనలకు విరుద్ధమని అధికారులు చెబుతున్నారు.

News November 29, 2025

హైదరాబాదులో గుండ్లపల్లి మండల వాసి ఆత్మహత్య

image

నిరుద్యోగం, ఆర్థిక సమస్యలతో నల్గొండ(D) గుండ్లపల్లి(M) తవక్లాపూర్‌కు చెందిన ఆంజనేయులు(27) హైదరాబాద్‌లో ఆత్మహత్య చేసుకున్నాడు. పోటీ పరీక్షల కోసం 8 నెలల క్రితం LBనగర్‌కు వెళ్లాడు. శుక్రవారం మ.1:10కి బంధువు అనిల్‌కు చనిపోతానని ఫోన్లో చెప్పాడు. విషయాన్ని వెంటనే సోదరుడు అభినందన్‌కు తెలియజేయగా అతను వెళ్లి చూసేసరికి ఉరేసుకొని కనిపించాడు. అతని సోదరుడు ఫిర్యాదు చేశాడని LBనగర్ సీఐ వినోద్ తెలిపారు.

News November 28, 2025

నల్గొండ జిల్లాలో ఇవాళ్టి టాప్ న్యూస్

image

✓మర్రిగూడ: నగదు ఎలా స్వీకరిస్తున్నారు.. ఇలా త్రిపాఠి వాకబు
✓చెర్వుగట్టు హుండీ ఆదాయం లెక్కింపు
✓చండూరు: కుల ధృవీకరణ కోసం పడిగాపులు
✓మిర్యాలగూడ: భర్త ఇంటి ముందు భార్య ఆందోళన
✓నల్గొండ: కుక్కల స్వైర విహారం.. 22 గొర్రెల మృతి
✓కట్టంగూరు: కాంగ్రెస్‌లో బయటపడ్డ వర్గ విభేదాలు
✓చిట్యాల: అప్పుడు వార్డు మెంబర్.. ఇప్పడు మండలి ఛైర్మన్