News March 8, 2025
మహిళలు, బాలికల భద్రతే మా ద్యేయం: కర్నూలు ఎస్పీ

మహిళలు, బాలికల భద్రతే తమ ధ్యేయమని ఎస్పీ విక్రాంత్ పాటిల్, ఏపీఎస్పీ 2వ బెటాలియన్ కమాండెంట్ దీపికా పాటిల్ అన్నారు. శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని కర్నూలు జిల్లా పోలీసు కార్యాలయంలోని పరేడ్ మైదానంలో పోలీసు కుటుంబాల మహిళల కోసం ప్రత్యేకంగా ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. మహిళలు ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని వారు సూచించారు.
Similar News
News March 17, 2025
తెలుగు రాష్ట్రాల ప్రజలు కలిసి ఉండాలి: కర్నూలు కలెక్టర్

తెలుగు రాష్ట్రాల ప్రజలంతా కలిసి ఉండాలని, ప్రత్యేక రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు చేసిన త్యాగం మరువలేనిదని, రాష్ట్ర మంత్రి టీజీ భరత్, జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా, సోమిశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు. ఆదివారం పొట్టి శ్రీరాములు 124వ జయంతిని పురస్కరించుకొని జిల్లా అధికార యంత్రంలో చిల్డ్రన్స్ పార్క్‌లో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కేఎంసీ కమిషనర్ పాల్గొన్నారు.
News March 17, 2025
కర్నూలు: ఉరి వేసుకొని వ్యక్తి మృతి

కర్నూలు జిల్లా మంత్రాలయం మండల కేంద్రంలో ఆదివారం గుర్తు తెలియని ఓ వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గ్రామ శివారులోని మెలిగుట్ట దగ్గర ఓ చెట్టుకు ఉరి వేసుకున్నాడు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. శరీరం గుర్తుపట్టని విధంగా ఉంది. మృతుని ఆచూకీ తెలిసినవారు ఎస్ఐ 9121101152కి సంప్రదించాలని సూచించారు.
News March 17, 2025
కర్నూలు జిల్లా TODAY TOP NEWS

➤కర్నూలు: పదో తరగతి విద్యార్థులకు అలర్ట్
➤ఆదోనిలో ‘గరివిడి లక్ష్మి’ సినిమా షూటింగ్
➤పొట్టి శ్రీరాములు జీవిత చరిత్ర అనుసరణీయం: మంత్రి భరత్
➤తోటి డ్రైవర్‌కు అండగా నిలిచిన ఆటో యూనియన్
➤ఆదోని: ‘గొంతు ఎండుతోంది సారూ.. మా కష్టాలు తీర్చండి’
➤ఒత్తిడిని అధిగమించి పరీక్షలు రాయాలి: MP
➤పెద్దకడుబూరు: పులికనుమ రిజర్వాయర్లో వ్యక్తి గల్లంతు?
➤మంత్రాలయం: ఉరి వేసుకొని వ్యక్తి మృతి