News November 8, 2025
మహిళలు వేధింపులపై మౌనంగా ఉండొద్దు: ఎస్పీ నరసింహ

మహిళలు, బాలికలు లైంగిక వేధింపులను ధైర్యంగా బయటకువచ్చి చెప్పాలని ఎస్పీ నరసింహ సూచించారు. పనిచేసే చోట, కళాశాలలు, ఇతర ప్రాంతాల్లో మహిళలు, బాలికలు ఆపద సమయాల్లో హెల్‌లైన్ నంబర్లు సంప్రదించాలని ఎస్పీ అన్నారు. ‘వేధింపులపై మౌనంగా ఉండొద్దు.. మీ కోసం షీ టీమ్స్ పనిచేస్తాయని’ ఎస్పీ మహిళలకు సూచించారు.
Similar News
News March 7, 2026
ఇండియన్ బిలియనీర్ల సంపద రూ.112 లక్షల కోట్లు

హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్-2026 ప్రకారం బిలియనీర్ల సంఖ్య 4,020కి చేరింది. గతేడాదితో పోలిస్తే 578 మంది పెరిగారు. 1,100 బిలియనీర్లతో చైనా టాప్‌లో ఉండగా, ఆ తర్వాత US(1,000), IND(308) ఉన్నాయి. ఇండియన్ బిలియనీర్ల సంపద ₹112L Cr. ఇక ఎలాన్ మస్క్ $792Bn ఆస్తితో ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నారు. ఆ తర్వాత జెఫ్ బెజోస్-అమెజాన్($300Bn), లారీ పేజ్-ఆల్ఫాబెట్($271Bn), లారీ ఎల్లిసన్-ఒరాకిల్($267Bn) ఉన్నారు.
News March 7, 2026
SVU: పరీక్ష ఫీజు చెల్లించండి.!

తిరుపతి శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీ(SVU) పరిధిలో డిగ్రీ (UG) 4, 6 సెమిస్టర్ పరీక్షలు ఏప్రిల్ నెలలో జరగనున్నట్లు యూనివర్సిటీ పరీక్షల విభాగ నియంత్రణ అధికారి రాజమాణిక్యం పేర్కొన్నారు. మార్చి 21వ తేదీలోపు విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించాలని సూచించారు. విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.
News March 7, 2026
స్టీల్ ప్లాంట్ ఉద్యోగి కూతురికి సివిల్స్‌లో 573వ ర్యాంక్

విశాఖకి చెందిన శ్వేత గుమ్మల సివిల్ సర్వీసెస్ పరీక్షలో 573వ ర్యాంక్ సాధించి ప్రతిభ చాటింది. ఆమె తండ్రి రాజాబాబు విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ఉద్యోగిగా పనిచేస్తుండగా, తల్లి విజయలక్ష్మి గృహిణి. శ్వేత విశాఖలో పాఠశాల విద్య, జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ పూర్తి చేసింది. తరువాత IIT హైదరాబాద్‌లో బీటెక్ పూర్తి చేసింది. కృషి, పట్టుదలతో సివిల్స్‌లో ర్యాంక్ సాధించి కుటుంబానికి, జిల్లాకు గర్వకారణంగా నిలిచింది.


