News November 22, 2024

మహిళలు ‘శుక్రవారం’ను సద్వినియోగం.. చేసుకోవాలి: కలెక్టర్ పమేలా

image

మహిళలు శుక్రవారం సభను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మహిళలకు సూచించారు. శుక్రవారంవీణవంక మండలం ఎలబాక గ్రామంలో అంగన్వాడీ కేంద్రంలో నిర్వహించిన శుక్రవారం సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలతో పాటు, మహిళలకు అన్ని రకాల ఆహార, వైద్య సదుపాయాలు కల్పిస్తున్నామని, సమస్యలు ఉంటే ఈ సభ ద్వారా పరిష్కరించుకోవాలని తెలిపారు.

Similar News

News December 9, 2024

వేములవాడ మాజీ MLA రమేశ్‌కు హైకోర్టు షాక్

image

VMWD మాజీ MLA రమేశ్‌కు హైకోర్టులో చుక్కెదురైంది. పౌరసత్వంపై రమేశ్ పిటీషన్‌ను హైకోర్టు డిస్మిస్ చేసింది. కేసు విషయమై 15.5 ఏళ్ల పాటు హైకోర్టులో సుదీర్ఘ విచారణ జరిగింది. విచారణ సందర్భంగా కోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చి, ఫేక్ డాక్యుమెంట్లు సమర్పించడంతో హైకోర్టు రమేశ్‌కు రూ.30 లక్షల జరిమానా విధించింది. ఇందులో ఆది శ్రీనివాస్‌కు రూ.25 లక్షలు, రూ.5 లక్షలు నెలరోజుల్లో కోర్టుకు చెల్లించాలని ఆదేశించింది.

News December 9, 2024

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలి: KTR

image

రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. మేము గతంలో మార్కెట్ కమిటీల్లో బలహీన వర్గాలకు రిజర్వేషన్ కల్పించాము, అలాగే స్థానిక ఎన్నికల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించింది BRS ప్రభుత్వామే అని గుర్తు చేశారు. బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే ఎన్నికల నిర్వహించాలన్నారు.

News December 9, 2024

మంత్రి పొన్నంను కలిసిన బిగ్ బాస్ సీజన్-8 ఫేమ్ సోనియా

image

పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గానికి చెందిన ఆకుల సోనియా ఇటీవల బిగ్‌బాస్ సీజన్-8కి వెళ్లి వచ్చింది. కాగా, నిన్న మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్‌ను మినిస్టర్స్ క్వార్టర్స్‌లో సోనియా మర్యాదపూర్వంగా కలిశారు. తన వివాహానికి హాజరుకావాలని కాబోయే భర్తతో కలిసి మంత్రికి ఆహ్వాన పత్రికను అందజేశారు. కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ సోదరుడు, తదితరులు ఉన్నారు.