News March 12, 2025
మహిళలు సమస్యలను ధైర్యంగా ఎదుర్కోవాలి: ఎస్పీ

ఏ సమస్య వచ్చినా వాటిని మహిళలు ధైర్యంగా ఎదుర్కోవాలని శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ రత్న సూచించారు. మంగళవారం చెన్నే కొత్తపల్లిలో టింబక్టు కలెక్టివ్ వారి ఆధ్వర్యంలో జరిగిన మహిళా సదస్సులో ఎస్పీ మాట్లాడారు. మహిళల రక్షణ కోసం ప్రత్యేక చట్టాలు ఉన్నాయన్నారు. ఒక దేశం అభివృద్ధి చెందాలంటే మహిళలు ఆర్థికంగా ఎదిగినప్పుడే కుటుంబం, సమాజం, రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతుందన్నారు.
Similar News
News October 14, 2025
నేరాల నియంత్రణపై దృష్టి సారించాలి: ASF ఎస్పీ

నేరాల నియంత్రణపై దృష్టి సారించాలని ASF ఎస్పీ కాంతిలాల్ పాటిల్ పోలీస్ అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా ఎస్పీ కార్యాలయ సమావేశ మందిరంలో నెలవారి నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. పోలీస్ స్టేషన్లో గ్రేవ్, నాన్ గ్రేడ్ పెండింగ్ కేసుల వివరాలు అడిగి తెలుసుకొన్నారు. పెండింగ్ కేసులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. గంజాయి సాగు నిర్మూలనకు ప్రత్యేక టీమ్ ఏర్పాటు చేశామన్నారు.
News October 14, 2025
MBNR: ఫొటోగ్రఫీ, షార్ట్ ఫిలిం.. UPDATE!

పోలీస్ ఫ్లాగ్ డే సందర్భంగా ఫొటోగ్రఫీ, షార్ట్ ఫిలిం పోటీలకు ఆహ్వానిస్తున్నట్లు ఎస్పీ డి.జానకి వెల్లడించారు.
✒ ఫొటోగ్రఫీ
అంశం: పోలీస్ సేవలు, త్యాగాలు/ప్రజా రక్షణ
ఫొటోలు: గరిష్ఠంగా 3
ఫొటో సైజు: 10×8 ఇంచులు
✒ షార్ట్ ఫిలిం
వ్యవధి: గరిష్ఠంగా 3Mits
థీమ్: పోలీస్ సేవలు, కర్తవ్య నిబద్ధత/సమాజ రక్షణ.. దగ్గరలోని పోలీస్ స్టేషన్లో మీ పూర్తి వివరాలతో పాటు ఫొటోలు, షార్ట్ ఫిలిం(పెన్ డ్రైవ్ రూపంలో) అందజేయాలి.
News October 14, 2025
ADB: అట్రాసిటీ కేసుల్లో విచారణ వేగవంతం చేయాలి

అట్రాసిటీ కేసుల్లో విచారణ వేగవంతం చేసి బాధితులకు అండగా నిలవాలని, ఎస్సీ, ఎస్టీలపై జరుగుతున్న
దౌర్జన్యాల పట్ల తక్షణమే స్పందించి వారికి న్యాయం చేకూర్చాలని కలెక్టర్ రాజర్షి షా సూచించారు. మంగళవారం కలెక్టరేట్లో నిర్వహించిన ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటి సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎమ్మెల్యే పాయల్ శంకర్, ఎస్పీ అఖిల్ మహాజన్తో కలిసి సభ్యుల అభిప్రాయాలు స్వీకరించారు.