News March 16, 2025

‘మహిళల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తుంది’ 

image

పెనుగొండలో జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యంలో జరిగిన మహిళా దినోత్సవ వేడుకల్లో పలు రంగాల్లో రాణించిన స్త్రీలకు మహిళా శిరోమణి పురస్కారాలను మంత్రి సవిత, ఎమ్మెల్యే పరిటాల సునీత లు అందజేశారు. మహిళల అభ్యున్నతికి టీడీపీ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఉద్యోగ, రాజకీయాల్లో స్త్రీలకు ప్రాధాన్యం ఇస్తామన్నారు. ప్రతి మహిళ శక్తి యాప్‌ను డౌన్లోడ్ చేసుకుని, పోలీసుల సాయం పొందాలని ఎస్పీ రత్న, ఆర్డీఓ సువర్ణ తెలిపారు

Similar News

News March 17, 2025

కామారెడ్డి: భార్యని చంపిన భర్త

image

అనుమానంతో భార్యని చంపాడో భర్త. ఈ ఘటన HYDలోని అంబర్‌పేట్‌లో జరిగింది. పోలీసుల వివరాలు.. కామారెడ్డి (D) దోమకొండ (M) అంబర్‌పేటకు చెందిన నవీన్‌కు బీబీపేట్(M)కు చెందిన రేఖ(27)తో పెళ్లైంది. వీరు HYDలో అంబర్‌పేట్‌లో నివాసం ఉంటున్నారు. మద్యానికి బానిసైన నవీన్‌ భార్య ప్రవర్తనపై అనుమానంతో ఈనెల 10న పెట్రోల్ పోసి నిప్పంటించగా.. చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందింది. రేఖ తల్లి ఫిర్యాదుతో కేసు నమోదైంది.

News March 17, 2025

పల్నాడు జిల్లాలో పలువురు పోలిస్ సిబ్బంది బదిలీలు

image

పల్నాడు జిల్లాలో పలువురు పోలీసు సిబ్బందిని బదిలీలు చేస్తూ ఎస్పీ శ్రీనివాసరావు ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలో వివిధ పోలిస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న పలువురు ఎఎస్ఐలు, హెడ్ కానిస్టేబుళ్లను బదిలీలు చేస్తూ ఉత్తర్వులిచ్చారు.  అదే విధంగా పలువురు స్పెషల్ బ్రాంచ్ సిబ్బందిని బదిలీలు చేస్తూ, పోస్టింగ్స్ ఇచ్చారు. 

News March 17, 2025

NGKL: వలస కార్మికుడి మృతి

image

కొల్లాపూర్ మండలంలో ఓ వలస కార్మికుడు మృతిచెందిన ఘటన ఆదివారం జరిగింది. పోలీసుల వివరాలు.. అస్సాంలోని మాదాపూర్‌కి చెందిన వినోద్‌దాస్(35) ఎల్లూరు శివారులో కొనసాగుతున్న పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పనులు చేసేందుకు వలస వచ్చాడు. ఆదివారం మద్యం తాగి నడుస్తుండగా రాయి తగిలి కిందపడటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, కుమార్తె ఉన్నారు.

error: Content is protected !!