News March 19, 2025

మహిళల భద్రతకు భరోసా శక్తి మొబైల్ యాప్: డీఎస్పీ

image

మహిళల భద్రతకు భరోసాగా ప్రభుత్వం ప్రత్యేకంగా రూపొందించిన శక్తి (ఎస్‌వోఎస్) మొబైల్ యాప్‌ను ప్రతి మహిళ, యువత తమ మొబైల్ ఫోన్లో డౌన్‌లోడ్ చేసుకొని తప్పనిసరిగా రిజిస్టేషన్ చేసుకోవాలని ఆళ్లగడ్డ డీఎస్పీ ప్రమోద్ సూచించారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. ప్రతి మహిళ మొబైల్ ఫోనులో శక్తి యాప్ నిక్షిప్తమై ఉంటే ఆపద సమయాల్లో పోలీసుల సహాయంతో పాటు సులువుగా రక్షణ పొందవచ్చునన్నారు.

Similar News

News October 29, 2025

సంగారెడ్డి: తుఫాన్ ఎఫెక్ట్.. జాతీయ రహదారిపైకి వరద

image

మొంథా తుఫాన్ నేపథ్యంలో బుధవారం ఉదయం నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు సంగారెడ్డి జిల్లా కంది మండలం చేర్యాల గ్రామ శివారులో జాతీయ రహదారిపై భారీగా వరద నీరు నిలిచిపోయింది. దీంతో వాహనాదారుల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రోడ్డు డౌన్‌గా ఉండడంతో ఈ ఇబ్బంది ఏర్పడింది. నేషనల్ హైవే అధికారులు స్పందించి వరద నీటిని తొలగించాలని ప్రయాణికులు కోరుతున్నారు.

News October 29, 2025

డోర్నకల్‌లో 104 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు

image

మహబూబాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మధ్యాహ్నం 12 గంటల వరకు వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి. డోర్నకల్ మండలంలో 104.5 మిల్లీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదయింది. కురవిలోని అయ్యగారి పల్లిలో 90 మిల్లి మీటర్లు, మహబూబాబాద్ మండలంలో అమనగల్ 89.3, మల్యాలలో 70.8, గూడూరు మండలంలోని భూపతి పేటలో69.0, తొర్రూర్ 67.5, గార్లలో 65 మిల్లి మీటర్లు, గంగారంలో అత్యల్పంగా 8.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అయింది.

News October 29, 2025

అర్హుల ఓట్లు తొలగిస్తే కాళ్లు విరగ్గొడతాం: బెంగాల్ మంత్రి

image

SIR పేరిట CAA అమలుకు BJP, EC ప్రయత్నిస్తున్నాయని బెంగాల్ మంత్రి ఫిర్హద్ హకీమ్ ఆరోపించారు. అర్హులైన ఒక్కరి ఓటు తొలగినా ఊరుకొనేది లేదని, కాళ్లు విరగ్గొడతామని హెచ్చరించారు. బీజేపీకి ఓటమి భయం పట్టుకుందని, మమత సీఎంగా ఉన్నన్నాళ్లూ రాష్ట్రంలో NRC అమలు కాబోదని స్పష్టం చేశారు. కాగా SIR పారదర్శకంగా జరుగుతుందని, అర్హులైన ఏ ఒక్కరి ఓటు తొలగబోదని బెంగాల్ CEO స్పష్టం చేశారు.