News March 5, 2025
మహిళల భద్రత కోసం ప్రత్యేక రక్షణ విభాగం: హోంమంత్రి

రాష్ట్రంలో మహిళలు, చిన్నారుల భద్రత కోసం ప్రత్యేక రక్షణ విభాగాన్ని ఏర్పాటు చేయనున్నట్లు హోంమంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు. మంగళవారం శాసనమండలిలో ఆమె మాట్లాడుతూ.. మహిళల భద్రత విషయంలో రాజీ పడబోమని స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో దిశా యాప్‌తో రక్షణ ఉండేదని వైసీపీ ఎమ్మెల్సీ కళ్యాణి చేసిన వ్యాఖ్యలపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది కేవలం ప్రచారానికి పరిమితమైందని అన్నారు.
Similar News
News March 16, 2025
GOOD NEWS: వారికి ఉచితంగా బస్సు

AP: రేపటి నుంచి రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇంగ్లిష్ మీడియం, NCERT సిలబస్‌తో వచ్చే నెల 1వరకూ పరీక్షల్ని నిర్వహించనున్నారు. ఉదయం 9.30 గంటలనుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు ఎగ్జామ్ నిర్వహించనున్నారు. హాల్ టికెట్ ఆధారంగా ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని ఆర్టీసీ కల్పించింది. ఈ ఏడాది పరీక్షలకు 6,49,275 మంది హాజరుకానున్నారు.
News March 16, 2025
అల్లూరి జిల్లాలో ప్రతీ కేంద్రంలో సిట్టింగ్ స్క్వాడ్: DEO

అల్లూరి జిల్లాలో పదో తరగతి పరీక్షలకు 71 కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని DEO బ్రహ్మాజీరావు తెలిపారు. జిల్లాలో పలు పరీక్ష కేంద్రాలో ఏర్పాట్లులను శనివారం ఆయన పరిశీలించి, టీచర్స్‌కు సూచనలు ఇచ్చారు. ప్రతీ కేంద్రంలో ఒక గెజిటెడ్ ఆఫీసర్, మరో సహాయ అధికారి సిట్టింగ్ స్క్వాడ్‌గా జిల్లా కలెక్టర్ నియమించారని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 510మంది ఇన్విజిలేటర్లుని నియమించామన్నారు.
News March 16, 2025
ఒంగోలు రిమ్స్‌లో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు

ప్రకాశం కలెక్టర్ తమీమ్ అన్సారియా నిన్న రాత్రి 11.30 గంటలకు ఒంటరిగా ఒంగోలు రిమ్స్ ఆసుపత్రికి వచ్చారు. క్యాజువాలిటీ వార్డును ఆకస్మికంగా తనిఖీ చేశారు. అందులో సీనియర్ డాక్టర్ లేకపోవడాన్ని గుర్తించారు. సంబంధిత డాక్టర్‌పై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాంటి సమాచారం లేకుండా కలెక్టర్ ఉన్నపళంగా ఆసుపత్రికి రావడంతో సిబ్బంది షాక్ అయ్యారు. మహిళా కలెక్టర్ రాత్రివేళ చెకింగ్ చేయడంపై అందరూ హర్షం వ్యక్తం చేశారు.