News June 16, 2024

మహిళల రక్షణకు అధిక ప్రాధాన్యం: హోంమంత్రి అనిత

image

మహిళల రక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తామని రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు. వైసీపీ పాలనలో స్త్రీలకు రక్షణ కరువైందని, రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ వాడకం బాగా పెరిగాయన్నారు. భూకబ్జాలు, దాడులకు హద్దులేకుండా పోయిందని ఆరోపించారు. వీటన్నింటినీ తమ ప్రభుత్వంలో సరిదిద్దుతానన్నారు. ఆడపిల్లలు కిడ్నాప్‌కు గురికాకుండా పటిష్ఠమైన చర్యలు చేపడతామన్నారు. శాంతిభద్రతల పరిరక్షణపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామన్నారు.

Similar News

News September 29, 2024

ఏయూ: ‘అక్టోబర్ 7 నుంచి దసరా సెలవులు’

image

ఏయూతో పాటు అనుబంధ కాలేజీలకు దసరా సెలవులు ప్రకటిస్తూ రిజిస్ట్రార్ ఈ.ఎన్ ధనుంజయ రావు ఉత్తర్వులు జారీ చేశారు. అక్టోబర్ 7 (సోమవారం) నుంచి 12(శనివారం) వరకు దసరా సెలవులు ఉంటాయని పేర్కొన్నారు. ఆదివారం కూడా సెలవు కావడంతో అక్టోబర్ 14(సోమవారం) తిరిగి తరగతులు ప్రారంభమవుతాయని వెల్లడించారు.

News September 29, 2024

అరకులో పాస్ పోర్టు ఆఫీస్..!

image

అరకులోయలో పాస్ పోర్టు ఆఫీస్ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తపాలా శాఖ డివిజనల్ సూపరింటెండెంట్ సంజయ్ పాండా తెలిపారు. శనివారం ఆయన అరకులోయలోని ఉప తపాలా శాఖ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లా ప్రజలకు పాస్ పోర్టు సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. అంతేకాకుండా ముంచంగిపుట్టు, డుంబ్రిగుడ మండలాల్లో ఉప తపాలా కార్యాలయాల ఏర్పాటుకు చర్యలు చేపట్టామన్నారు.

News September 29, 2024

విదేశాలలో తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట

image

అమెరికాలో గ్రేటర్ వాషింగ్టన్ తెలుగు కల్చరల్ సంఘం గోల్డెన్ జూబ్లీ వేడుకలు అత్యంత ఘనంగా జరుగుతున్నాయి. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు దంపతులు సంఘ సభ్యులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను విదేశాల్లో తెలుగు ప్రజలు ఇంత ఘనంగా నిర్వహించడం గర్వకారణం అని పేర్కొన్నారు. ఇంత చక్కని కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు.