News June 16, 2024
మహిళల రక్షణకు అధిక ప్రాధాన్యం: హోంమంత్రి అనిత

మహిళల రక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తామని రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు. వైసీపీ పాలనలో స్త్రీలకు రక్షణ కరువైందని, రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ వాడకం బాగా పెరిగాయన్నారు. భూకబ్జాలు, దాడులకు హద్దులేకుండా పోయిందని ఆరోపించారు. వీటన్నింటినీ తమ ప్రభుత్వంలో సరిదిద్దుతానన్నారు. ఆడపిల్లలు కిడ్నాప్‌కు గురికాకుండా పటిష్ఠమైన చర్యలు చేపడతామన్నారు. శాంతిభద్రతల పరిరక్షణపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామన్నారు.
Similar News
News January 22, 2026
ఖల్లీకోట్ స్టేషన్‌లో ఆగనున్న విశాఖ-హౌరా, సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు

ప్రయాణికుల సౌకర్యార్థం పలు రైళ్లకు ఖల్లీకోట్ రైల్వే స్టేషన్‌లో ప్రయోగాత్మక హాల్ట్‌ను కల్పిస్తున్నట్లు వాల్తేరు సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ కె. పవన్ కుమార్ తెలిపారు. ఈ నెల 26 నుంచి సికింద్రాబాద్-భువనేశ్వర్ (17016), సికింద్రాబాద్-హౌరా (12704) రైళ్లు, అలాగే 27 నుంచి భువనేశ్వర్-సికింద్రాబాద్ (17015), హౌరా-సికింద్రాబాద్ (12703) రైళ్లు ఖల్లీకోట్ స్టేషన్‌లో ఆగనున్నాయని తెలిపారు.
News January 22, 2026
గాజువాక జీవీఎంసీ సమావేశంలో కుప్పకూలిన ఇంజినీర్

జీవీఎంసీ గాజువాక జోనల్ కార్యాలయంలో గురువారం సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, స్వచ్ఛంద కార్పొరేషన్ ఛైర్మన్ పట్టాభిరామ్ ఉండగా ఇంజినీరింగ్ విభాగం సెక్షన్ ఇంజినీర్ గోవింద్ రాజు కుప్ప కూలిపోయారు. హుటాహుటిన ఆసుపత్రికి తోటి ఉద్యోగులు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News January 22, 2026
30న జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం

విశాఖ నగరపాలక సంస్థకు ఈ నెల 30న సాధారణ కౌన్సిల్ సమావేశం, ఫిబ్రవరి 4న 2026–27 వార్షిక బడ్జెట్‌కు ప్రత్యేక కౌన్సిల్ సమావేశం నిర్వహించేందుకు మేయర్ పీలా శ్రీనివాసరావు గ్రేటర్ కమిషనర్ కేతన్ గార్గ్‌కు ప్రతిపాదనలు పంపారు. రూ.50 లక్షల పనుల అనుమతులపై ఈ నెల 27న స్థాయి సంఘం సమావేశం జరగనుంది. పాలకవర్గ పదవీకాలం మార్చి 18తో ముగియనుండగా, మార్చి 7 తర్వాత కౌన్సిల్ సమావేశాలకు నిబంధనల ప్రకారం అవకాశం లేదు.


