News December 27, 2024
మహిళల రక్షణకు చట్టాల్లో మార్పులు వచ్చాయి: CI
ఆడపిల్లలు, చిన్నారులను గౌరవించకున్నా పర్వాలేదు కానీ అగౌరవపరిచి హింసకు గురిచేస్తే చట్ట ప్రకారం జైలుకెళ్లడం ఖాయమని HYDలోని శంకర్‌పల్లి సీఐ శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు. ఈరోజు ఓ గార్డెన్‌లో మహిళల మానసిక హింస, పలు అంశాలపై అవగాహన కార్యక్రమం జరిగింది. ఆడపిల్లలు నేటి సమాజంలో ధైర్యంగా ఉండాలంటే చదువుకోవాలని తద్వారా చట్టాల గురించి తెలుస్తుందన్నారు.
Similar News
News December 29, 2024
HYD: తెలంగాణ క్రికెటర్లు త్రిష, దృతిలకు HCA సన్మానం
ఐసీసీ మహిళల అండర్-19 టీ20 వరల్డ్‌కప్‌నకు ఎంపికైన తెలంగాణ క్రికెటర్లు జి.త్రిష, కె.ధ్రుతిలను ఉప్పల్ స్టేడియంలో HYD క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు అర్శనపల్లి జగన్‌మోహన్‌రావు సన్మానించి, అభినందించారు. ప్రతిష్ఠాత్మక వరల్డ్‌కప్ వంటి మెగా టోర్నీకి ఇద్దరు తెలంగాణ క్రికెటర్లు ఎంపికవ‌్వడం గర్వంగా ఉందన్నారు.
News December 29, 2024
రాష్ట్రపతి భవన్‌లో JAN-2 నుంచి సందర్శకులకు ప్రవేశం
బొల్లారంలోని రాష్ట్రపతి భవన్‌లో జనవరి 2 నుంచి 13 వరకు సందర్శకులకు ప్రవేశం కల్పించనున్నారు. ఈసారి ఉద్యాన్ ఉత్సవ్ – పుష్పాలు, హార్టికల్చర్ పండుగను ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు నిర్వహించనున్నారు. సుమారు 50 స్టాల్‌తో గ్రాండ్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయనున్నారు. సాయంత్రం 4గంటల నుంచి 8 గంటల వరకు వివిధ కళారూపాలను ప్రదర్శిస్తారు.
News December 28, 2024
HYD: అవగాహనతోనే మదకద్రవ్యాల నిర్మూలన: సందీప్ శాండిల్య
అవగాహనతో మాదకద్రవ్యాల దుర్వినియోగాన్ని పరిష్కరించాల్సిన అవసరం ఉందని టీజీఏఎన్‌బీ డైరెక్టర్ సందీప్ శాండిల్య అన్నారు. శనివారం ‘డ్రగ్-ఫ్రీ వెల్‌నెస్’ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఎడిస్టీస్ ఫౌండేషన్, క్రియేట్ ఎడ్యుటెక్‌లతో సహకార ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ మార్గదర్శకాలతో ఆన్‌లైన్ ప్రోగ్రామ్ పూర్తి చేసిన వారికి సర్టిఫికెట్లు అందజేశారు.