News August 27, 2024

మహిళల రక్షణ కోసం 112 యాప్: DSP

image

రాష్ట్రంలో మహిళల రక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం నూతనంగా 112 ఆప్ తీసుకొచ్చింది. ఈ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆపద సమయంలో 112కు ఫిర్యాదు చేస్తే సమీపంలోని ఠాణాకు సమాచారం వెళ్తుందని వనపర్తి డీఎస్పీ వెంకటేశ్వర్‌రావు తెలిపారు. అప్రమత్తమై లొకేషన్‌ ద్వారా వారు ఉన్న ప్రాంతాన్ని గుర్తించి కాపాడుతారని.. ప్రతి ఒక్కరు ఈ యాప్‌పై అవగాహన పెంచుకుని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

Similar News

News September 30, 2024

అంత్యక్రియలకు వెళ్తూ ట్రాక్టర్ బోల్తా.. వ్యక్తి మృతి

image

దౌల్తాబాద్ మండలంలో తీవ్ర విషాదం నెలకొంది. అంత్యక్రియలకు వెళ్తూ ట్రాక్టర్ బోల్తా పడిన సంఘటనలో ఒకరు మృతి చెందగా ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. స్థానికులు తెలిపిన వివారాలు.. దౌల్తాబాద్ మండలం నుంచి అంత్యక్రియల కోసం వెళ్తుండగా దేవర ఫసల్వాద్ సమీపంలో అదుపు తప్పి ఈర్లపల్లి గ్రామానికి చెందిన ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News September 30, 2024

ఉమ్మడి జిల్లా నేటి ఉష్ణోగ్రత వివరాలిలా

image

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా సోమవారం ఈ క్రింది విధంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా మహబూబ్నగర్ జిల్లా కొత్తపల్లిలో 35.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. గద్వాల జిల్లా చిన్నతండ్రపాడులో 35.4 డిగ్రీలు, నారాయణపేట జిల్లా గుండుమల్‌లో 33.2 డిగ్రీలు, వనపర్తి జిల్లా గణపూర్‌లో 32.7 డిగ్రీలు, నాగర్ కర్నూల్ జిల్లా పద్రాలో 31.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

News September 30, 2024

జూరాల ప్రాజెక్టుకు తగ్గిన ఇన్‌ఫ్లో

image

జూరాలకు ఇన్ ఫ్లో తగ్గినట్లు పీజేపీ అధికారులు తెలిపారు. ఆదివారం ఎగువ నుంచి 72 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉన్నట్లు వివరించారు. 4 క్రస్టు గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. 5 యూనిట్లను కొనసాగించి విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. గేట్ల ద్వారా, ఆవిరిరూపంలో, విద్యుదుత్పత్తి నిమిత్తం, కాల్వలకు ఇలా మొత్తంగా 68,647 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.