News August 27, 2024

మహిళల రక్షణ కోసం 112 యాప్: DSP

image

రాష్ట్రంలో మహిళల రక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం నూతనంగా 112 ఆప్ తీసుకొచ్చింది. ఈ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆపద సమయంలో 112కు ఫిర్యాదు చేస్తే సమీపంలోని ఠాణాకు సమాచారం వెళ్తుందని వనపర్తి డీఎస్పీ వెంకటేశ్వర్‌రావు తెలిపారు. అప్రమత్తమై లొకేషన్‌ ద్వారా వారు ఉన్న ప్రాంతాన్ని గుర్తించి కాపాడుతారని.. ప్రతి ఒక్కరు ఈ యాప్‌పై అవగాహన పెంచుకుని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

Similar News

News September 16, 2024

వట్టెం నవోదయలో ప్రవేశాలకు గడువు పెంపు

image

బిజీనేపల్లి మండలం వట్టెంలోని జవహర్ నవోదయ విద్యాలయంలో 2025-26 విద్యా సంవత్సరంలో 6వ తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తు గడువును ఈనెల 23 వరకు పొడిగించినట్లు ప్రిన్సిపల్ శ్రీ పి.భాస్కర్ కుమార్ తెలిపారు. ఐదో తరగతి చదువుతున్న ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాలకు నవోదయ వెబ్‌సైట్‌లో చూడాలని చెప్పారు.

News September 16, 2024

శ్రీశైలం ప్రాజెక్టుకు వరద

image

శ్రీశైలం జలాశయంలో ఆదివారం రాత్రి 9 గంటలకు 883.30 అడుగులు, నీటి నిల్వ 206,0906 టీఎంసీలుగా నమోదైంది. ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతూనే ఉంది. ఎగువ పరివాహక ప్రాంతాలైన జూరాల, సుంకేసుల జలాశయాల నుంచి 41,287 క్యూసెక్కుల వరద నీరు శ్రీశైలం జలాశయానికి వస్తోంది. శ్రీశైలం కుడి, ఎడమగట్టు జలవిద్యుత్తు కేంద్రాల్లో విద్యుత్తు ఉత్పత్తి చేస్తూ 68,194 క్యూసెక్కుల వరద నీటిని నాగార్జునసాగర్ కు విడుదల చేస్తున్నారు.

News September 16, 2024

MBNR: 11ఏళ్ల నిరీక్షణకు తెర.. బదిలీలపై టీచర్ల సంతోషం

image

ఆదర్శ పాఠశాలల్లో ఎట్టకేలకు 11ఏళ్ల తర్వాత బదిలీలు చేపట్టడంతో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని ఉపాధ్యాయులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 2013లో ఈ పాఠశాలలు ప్రారంభించగా.. అప్పటి నుంచి బదిలీలు చేపట్టలేదు. తాజాగా విద్యాశాఖ PGT, TGTలను పాత జోన్ల ప్రకారం బదిలీలు చేసింది. దీంతో ఆదర్శ పాఠశాలల్లో మొత్తం 160 ఖాళీలు ఉన్నాయి. సెలవు రోజుల్లో బదిలీ ఉత్తర్వులు ఇవ్వడం పట్ల పలువురు ఆందోళనకు గురయ్యారు.