News July 5, 2024

మహిళా అథ్లెట్లు ఒలింపిక్స్‌కు ఎంపికవడం గర్వంగా ఉంది: నారా లోకేశ్

image

ఏపీకి చెందిన మహిళా అథ్లెట్లు 2024 పారిస్ ఒలింపిక్స్‌కు ఎంపికవడం గర్వంగా ఉందని మంత్రి నారా లోకేశ్ అన్నారు. కొన్నేళ్లుగా దండి జ్యోతికశ్రీ, యర్రాజి జ్యోతి పడిన కష్టానికి మంచి అవకాశం లభించిందన్నారు. కృషి, పట్టుదలతో వారు కచ్చితంగా ఒలింపిక్ మెడల్ అందుకోవాలనే కలను నెరవేర్చుకుంటారన్నారు. ఒలింపిక్స్‌లో మంచి ప్రదర్శన కనబరిచి ఏపీ ప్రజలు గర్వపడేలా చేయాలని లోకేశ్ ఆకాంక్షించారు.

Similar News

News January 5, 2026

తెనాలి సబ్ కలెక్టర్ గ్రీవెన్స్‌కు 7 ఫిర్యాదులు

image

తెనాలి సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్‌కు 7 ఫిర్యాదులు వచ్చాయి. సబ్ కలెక్టర్ సంజనా సింహ వేరే అధికారిక కార్యక్రమానికి వెళ్లడంతో కార్యాలయ అధికారులే ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. రెవెన్యూ 1, మున్సిపాలిటీ 2, దేవాదాయ శాఖ 1, పంచాయతీ రాజ్ విభాగానికి 3 అర్జీలు చొప్పున మొత్తం 7 ఫిర్యాదులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. వాటిని ఆయా విభాగాలకు పంపి పరిష్కరిస్తామని తెలియజేశారు.

News January 5, 2026

GNT: సీఎం చంద్రబాబు నేటి షెడ్యూల్

image

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం గుంటూరులో పర్యటించనున్నారు. ఉదయం 10:35 గంటలకు గుంటూరులోని శ్రీ సత్యసాయి స్పిరిచ్యువల్ సిటీకి చేరుకుంటారు. అక్కడ 10:45 గంటలకు జరిగే 3వ ప్రపంచ తెలుగు మహాసభల్లో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 12:50 గంటలకు సచివాలయానికి వస్తారు. సాయంత్రం 4:30 గంటలకు ఆర్టీజీఎస్‌పై అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. సాయంత్రం 6:30 గంటలకు నివాసానికి చేరుకుంటారు.

News January 5, 2026

నేడు గుంటూరుకు సీఎం చంద్రబాబు రాక

image

రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సోమవారం గుంటూరు రానున్నారు. ఉదయం 10:25 ని.లకు బొమ్మిడాల నగర్ శ్రీ సత్య సాయి స్పిరిట్యుయల్ ట్రస్ట్ సమీపంలో ఏర్పాటు చేసిన హెలిపాడ్ వద్దకు హెలికాప్టర్‌లో చేరుకుంటారు. అక్కడి నుండి బయలుదేరి ఉదయం 10:35 ని.లకు మూడవ ప్రపంచ తెలుగు మహాసభలలో పాల్గొననున్నారు. ఈ మేరకు అధికారులు బందోబస్త్ ఏర్పాట్లు చేశారు.