News April 5, 2025

మహిళా కాలేజి వసతి గృహంలో భోజనం చేసిన జిల్లా కలెక్టర్

image

డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ 118వ జయంతి సందర్భంగా విశాఖ ప్రభుత్వ మహిళా కాలేజీ వసతి గృహంలో శనివారం జయంతి వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ఎం.ఎన్ హ‌రేంధిర ప్ర‌సాద్ పాల్గొని జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలు వేసి ఆయన చేతుల మీదగా కేక్ కట్ చేశారు. అనంతరం వసతి గృహంలో విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. వసతిగృహంలో ఉన్న వసతుల గురించి విద్యార్థులు అడిగి తెలుసుకున్నారు.

Similar News

News November 13, 2025

రైతులతో సోలార్ ప్లాంట్ల ఏర్పాటు యోచన: CM

image

రాష్ట్రంలో రైతులతో సోలార్ ప్లాంట్ల ఏర్పాటు యోచనలో ఉన్నట్లు సీఎం చంద్రబాబు వెల్లడించారు. వ్యవసాయానికి యోగ్యం కాని భూములు, బీడు భూముల్లో రైతులు సోలార్, విండ్ విద్యుత్ ఉత్పత్తి చేస్తే ఎంతమేర లాభదాయకంగా ఉంటుందని CMచంద్రబాబు రెన్యూ పవర్ చైర్మన్ సుమంత్ సిన్హాతో చర్చించారు. సోలార్ ప్యానెల్స్ ధరలు అధికంగా ఉన్నందున వాటి తయారీ యూనిట్లు రాష్ట్రంలో పెద్దఎత్తున నెలకొల్పేందుకు ప్రోత్సహిస్తామని CM వెల్లడించారు.

News November 13, 2025

4 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి హీరో గ్రూప్ ఎంఓయూ

image

4 గిగావాట్ల పునరుద్పాతక విద్యుత్ రంగంలో పెట్టుబడులకు హీరో ఫ్యచర్ ఎనర్జీస్ సంస్థ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. రూ.15వేల కోట్ల వ్యయంతో అనంతపురం, కడప, కర్నూలులో విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ సంస్థ ముందుకొచ్చింది. సంస్థ సీఎండీ రాహుల్ ముంజాల్ గురువారం సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యి ఈడీబీ ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ప్రభుత్వం తరపున పూర్తి సహకారం అందిస్తామన్నారు.

News November 13, 2025

జోడుగుళ్లపాలెం సముద్ర తీరంలో మృతదేహం

image

ఆరిలోవ స్టేషన్ పరిధి జోడుగుళ్లపాలెం బీచ్‌కు గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం గురువారం ఉదయం కొట్టుకొచ్చిందని పోలీసులు తెలిపారు. మృతుని వయస్సు సుమారు 35-40 ఏళ్ల మధ్య ఉంటుందని.. రెండు చేతుల మీద పచ్చబొట్లు ఉన్నాయని చెప్పారు. మృతుడిని ఎవరైనా గుర్తుపడితే ఆరిలోవ పోలీసులకు తెలియజేయాలని సీఐ మల్లేశ్వరరావు కోరారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించామన్నారు.