News March 3, 2025
మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలి: కలెక్టర్

పార్వతీపురం జిల్లాలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మహిళా దినోత్సవ వేడుకల నిర్వహణపై సోమవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళా దినోత్సవ వేడుకల్లో మహిళలందరినీ భాగస్వాములను చేయాలన్నారు.
Similar News
News March 4, 2025
ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా నాగబాబు?

AP: ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోదరుడు, నటుడు నాగబాబును ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో మొత్తం 5 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. వాటిలో ఒకటి జనసేన తరఫున నాగబాబుకు ఖరారైనట్లు సమాచారం. కాగా ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత నాగబాబును క్యాబినెట్‌లోకి తీసుకుంటారని వార్తలు వస్తున్నాయి. గతంలో చంద్రబాబు కూడా ఆయనను మంత్రిమండలిలోకి తీసుకుంటామని ప్రకటించారు.
News March 4, 2025
ఆలపాటి రాజా భారీ విజయం

AP: గుంటూరు-కృష్ణా జిల్లా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజా ఘన విజయం సాధించారు. 50 శాతానికిపైగా ఓట్లు సాధించి విజయం ఖరారు చేసుకున్నారు. ఏడు రౌండ్లు ముగిసేసరికి పీడీఎఫ్ అభ్యర్థి కేఎస్ లక్ష్మణ్‌పై రాజా 67,252 ఓట్ల మెజారిటీ సాధించారు. మొత్తం 2,41,873 ఓట్లలో 1,18,070 ఓట్లు రాబట్టారు. చెల్లని ఓట్లు 21,577 ఉన్నాయి.
News March 4, 2025
ICC నాకౌట్స్ అంటే హెడ్‌కు పూనకాలే!

ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఇవాళ ఇండియా, ఆస్ట్రేలియా మధ్య సెమీస్ జరగనుంది. ఇందులో ఆసీస్ విధ్వంసకర ప్లేయర్ ట్రావిస్ హెడ్ బరిలోకి దిగుతున్నారు. ఆయనకు ఐసీసీ టోర్నీల్లో ఘనమైన రికార్డు ఉంది. భారత్‌తో జరిగిన ODI WC సెమీస్‌లో 62, ఫైనల్లో 137, WTC ఫైనల్లో 163 బాదారు. ఈ మూడు మ్యాచుల్లోనూ ఆయన ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్నారు. ఇవాళ భారత్‌తో మ్యాచ్ కాబట్టి హెడ్ చెలరేగే ఆస్కారం ఉంది.