News March 5, 2025

మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలి: SP

image

జిల్లా కేంద్రంలో మార్చి 8న చేపట్టే మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను SP వకుల్ జిందాల్ ఆదేశించారు. స్థానిక మహిళ పీఎస్‌ను బుధవారం సందర్శించి ఏర్పాట్లపై ఆరా తీశారు. జిల్లా కేంద్రంలోని మహిళా పోలీసు స్టేషను వద్ద మార్చి 8న నిర్వహించనున్న మహిళా దినోత్సవ ర్యాలీలో పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొనే విధంగా చర్యలు చేపట్టాలన్నారు.

Similar News

News April 17, 2026

VZM: స్వయంగా స్వీయ గణన పూర్తి చేసిన కలెక్టర్

image

జనగణన-2027 కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి స్వీయ గణన ప్రక్రియను గురువారం పూర్తి చేశారు. ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిన ఈ సౌకర్యం ద్వారా ప్రజలు అధికారిక వెబ్‌సైట్‌లో మొబైల్ నంబర్, ఓటీపీ ద్వారా లాగిన్ అయి కుటుంబ సభ్యుల వివరాలను నమోదు చేయాలని సూచించారు. ఏవైనా ఇబ్బందులు ఉంటే సచివాలయ సిబ్బంది సహాయం తీసుకోవాలని అన్నారు.

జలధారతో భూగర్భ జలమట్టం పెంచాలి: కలెక్టర్

image

విజయనగరం జిల్లాలో జలధార-నీటి భద్రత కింద చేపడుతున్న పనుల ద్వారా భూగర్భ జలమట్టం పెరిగేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి ఆదేశించారు. గురువారం వర్చువల్‌గా మండల అధికారులతో సమీక్ష నిర్వహించారు. 215 ప్రాధాన్యత గ్రామాల్లోని 1,679 చెరువులకు అంచనాలు సిద్ధం చేసి పంపాలని, జిల్లాలోని 8,010 చెరువులకు పనులు గుర్తించి ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. పనులను ఉపాధి హామీ పథకం కింద నమోదు చేయాలన్నారు.