News March 5, 2025

మ‌హిళా దినోత్స‌వ వేడుక‌ల‌ను విజ‌య‌వంతం చేద్దాం: కలెక్టర్

image

కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు మ‌హిళా భ‌ద్ర‌త‌, సాధికార‌త‌కు అత్యంత ప్రాధాన్య‌మిస్తున్నాయ‌ని వారిని స‌మ‌గ్రాభివృద్ధి దిశ‌గా న‌డిపించేలా అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వ వేడుక‌ల‌ను విజ‌య‌వంతం చేద్దామ‌ని క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ అన్నారు. ఈ నెల 8న అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్సవ సందర్బంగా బుధ‌వారం అన్ని జిల్లాల క‌లెక్ట‌ర్ల‌తో వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు.

Similar News

News December 9, 2025

మహాలక్ష్మి పథకంతో మహిళలకు రూ.8,459 కోట్లు ఆదా: పొన్నం

image

TG: మహాలక్ష్మి పథకం ద్వారా RTCలో మహిళలకు ఉచిత ప్రయాణాలు మొదలై రెండేళ్లు పూర్తయ్యాయని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈ సందర్భంగా ఉద్యోగులు, సిబ్బందికి శుభాకాంక్షలు తెలియజేశారు. రెండేళ్లలో మహిళలు 251 కోట్ల జీరో టికెట్ల ద్వారా రూ.8,459 కోట్లు ఆదా చేసినట్లు వెల్లడించారు. బస్సుల్లో ఉచిత ప్రయాణమే కాకుండా మహిళలను బస్సులకు యజమానులుగా చేసిన ప్రభుత్వంగా నిలిచిందని పేర్కొన్నారు.

News December 9, 2025

స్వల్పంగా తగ్గిన బంగారం ధర

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.330 తగ్గి రూ.1,30,090కు చేరింది. అలాగే 22క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.300 పతనమై రూ.1,19,250 పలుకుతోంది. అటు కేజీ వెండి ధర రూ.1,000 పెరిగి రూ.1,99,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.

News December 9, 2025

కృష్ణా: బీ.ఫార్మసీ పరీక్షల టైం టేబుల్ విడుదల

image

కృష్ణా యూనివర్శిటీ(KRU) పరిధిలోని కళాశాలల్లో బీ.ఫార్మసీ(2017 రెగ్యులేషన్) చదివే విద్యార్థులు రాయాల్సిన 5వ సెమిస్టర్ పరీక్షల టైం టేబుల్ విడుదలైంది. DEC 29, 31, JAN 2, 5, 7వ తేదీలలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు వర్శిటీ పరిధిలోని 3 కళాశాలలలో ఈ పరీక్షలు నిర్వహిస్తామని KRU అధ్యాపకులు తెలిపారు. పూర్తి వివరాలకు https://kru.ac.in/ వెబ్‌సైట్ చూడాలని కోరారు.