News March 6, 2025

మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించాలి: కలెక్టర్

image

అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం కలెక్టరేట్లో డీఆర్డీఏ, మెప్మా, స్కిల్ డెవలప్మెంట్, ఇండస్ట్రియల్ ప్రభుత్వ శాఖ అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ నెల 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా చూడాలని ఆదేశించారు.

Similar News

News October 28, 2025

నేడే కురుమూర్తి ఉద్దాల మహోత్సవం

image

కురుమూర్తి బ్రహ్మోత్సవాలలో ప్రధాన ఘట్టమైన ఉద్దాల మహోత్సవం నేడు జరగనుంది. లక్షలాది మంది భక్తులు హాజరు కానున్న నేపథ్యంలో, జిల్లా అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. భక్తుల కోసం ప్రత్యేక ఆర్టీసీ బస్సు సర్వీసులను నడుపుతున్నారు. ఉత్సవం మార్గంలో ఎలాంటి అవాంతరాలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

News October 28, 2025

‘మొంథా’ ఎఫెక్ట్: నంద్యాల జిల్లాలో పాఠశాలలకు సెలవులు

image

‘మొంథా’ తుఫాను కారణంగా నంద్యాల జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు నేడు, రేపు (28, 29వ తేదీలు) రెండు రోజుల పాటు సెలవులను ప్రకటిస్తూ కలెక్టర్ రాజకుమారి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. పలుచోట్ల పాఠశాలలు కొన్ని దెబ్బ తిని, పైకప్పులు పడిపోయే ప్రమాదం కూడా ఉన్నందున సెలవులను ప్రకటిస్తున్నట్లు పేర్కొన్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఎంఈఓలకు డీఈఓ జనార్దన్ రెడ్డి సెలవుల సర్కులర్ జారీ చేశారు.

News October 28, 2025

‘మొంథా’ తుఫాను UPDATES

image

➤ విశాఖ, కోనసీమ, కాకినాడ తదితర జిల్లాల్లో అర్ధరాత్రి నుంచి భారీ వర్షం.. పలుచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం
➤ తీర ప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలింపు
➤ విశాఖకు వచ్చే 16రైళ్లు రద్దు
➤ 11 జిల్లాల్లో 6 లక్షల హెక్టార్ల పంటలపై తుఫాను ప్రభావం!
➤ తుఫాను ప్రభావిత ప్రాంతాల నుంచి 787మంది గర్భిణులు సమీప ఆస్పత్రులకు తరలింపు
➤ సహాయక చర్యలకు సిద్ధమైన తూర్పు నౌకాదళం.. సరకు రవాణా విమానాలు, హెలికాప్టర్లు రెడీ