News March 9, 2025
మహిళా నిరుద్యోగులకు గుడ్ న్యూస్

అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాలలో మహిళ నిరుద్యోగులకు రూడ్ సెట్ శుభవార్త చెప్పింది. ఏప్రిల్ 4 నుంచి మే 3వ తేదీ వరకు ఉచితంగా ఎస్కే యూనివర్సిటీ పక్కన ఆకుతోటపల్లి శిక్షణ కార్యాలయంలో జర్దోసి మగ్గం, కుట్టు మిషన్లలో శిక్షణ ఇవ్వనున్నట్లు డైరక్టర్ విజయలక్షి తెలిపారు. నెల రోజుల పాటు ఉచిత వసతి, భోజనం సౌకర్యాలు ఉంటాయన్నారు. మరిన్ని వివరాలకు కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.
Similar News
News October 28, 2025
అనంత: జిల్లా అధికారులతో సమావేశం

అనంతపురం కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్లో షెడ్యుల్డ్ కులాల సంక్షేమం కొరకు ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ కమిటీ అన్ని ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ ఆనంద్, జిల్లా ఎస్పీ జగదీశ్లతో కలిసి ఆంధ్రప్రదేశ్ శాసనసభ కమిటీ అధ్యక్షులు కుమార్ రాజావర్ల పాల్గొన్నారు. కమిటీ సభ్యులు కావలి గ్రీష్మ, ఎమ్మెస్ రాజు, విజయ్ కుమార్ బిఎన్, రోషన్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.
News October 27, 2025
అనంతపురంలో దారుణం.. బాలుడిని చంపిన వ్యక్తి

అనంతపురంలో దారుణం చోటుచేసుకుంది. స్థానిక అరుణోదయ కాలనీలో సుశాంత్(5) అనే బాలుడిని పక్కింటి వ్యక్తి హతమార్చినట్లు సమాచారం. అయితే ఆదివారం తమ బాలుడు కనిపించడం లేదని మూడో పట్టణ పోలీస్ స్టేషన్లో తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
News October 27, 2025
రాష్ట్ర ర్యాంకింగ్ చెస్ టోర్నమెంట్లో సత్తాచాటిన క్రీడాకారులు

కర్నూలులో ఏపీ రాష్ట్ర ర్యాంకింగ్ చెస్ టోర్నమెంట్ ఆదివారం నిర్వహించారు. ఈ టోర్నమెంట్లో జిల్లా క్రీడాకారులు రాణించారు. ఇంటర్నేషనల్ ఆర్బిటర్ ఉదయ్ కుమార్ నాయుడు మాట్లాడుతూ.. సంతోష్కు అండర్-6లో 4వ స్థానం, వెనీషాకు బాలికల -12లో 4వ స్థానం, నితీష్కు -14లో 5వ స్థానం, జనని ఎఫ్-10లో 8వ స్థానం సాధించారన్నారు. విజేతలకు టోర్నమెంట్ డైరెక్టర్ శ్రీనివాస్ కామిశెట్టి బహుమతులు అందించారు.


