News March 6, 2025
మహిళా శక్తి పథకం గ్రౌండింగ్ పనులను పూర్తి చేయండి

ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలోని 16 రకాల యూనిట్ల గ్రౌండింగ్ వంద శాతం పూర్తి చేసి లక్ష్యాలను సాధించాలని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి ఆదేశించారు. బుధవారం కలెక్టర్ ఛాంబర్లో జిల్లా గ్రామీణభివృద్ధి శాఖ అధికారులతో మహిళా శక్తి పథకం యూనిట్ల లక్ష్యం, బ్యాంక్ లింకేజీ రుణాలు తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. మహిళలని ఆర్థికంగా బలోపేతం చేయడమే దీని ఉద్దేశమన్నారు.
Similar News
News December 5, 2025
హిమాచల్ప్రదేశ్ సీఎంని ఆహ్వానించిన మంత్రి అడ్లూరి

ఈనెల8,9 తేదీలలో జరగనున్న తెలంగాణ రెజ్లింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 కార్యక్రమానికి హిమాచల్ ప్రదేశ్ సీఎం సుకిందర్ సింగ్ను రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆహ్వానించారు. శుక్రవారం మంత్రి స్వయంగా హిమాచల్ ప్రదేశ్ వెళ్లి సీఎంని ఆహ్వానించారు. అనంతరం తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమంపై ఇరువురు ముచ్చటించుకున్నారు. సీఎం స్పందించి తప్పకుండా వస్తానని హామీ ఇచ్చారు.
News December 5, 2025
ములుగు: నేర చరిత్రను దాచిన సర్పంచ్ అభ్యర్థి..!

సర్పంచ్ ఎన్నికలు వివాదాల వైపుకు దారి తీస్తున్నాయి. వెంకటాపూర్ మండలం ఎల్లారెడ్డిపల్లి పంచాయతీలో సర్పంచ్గా పోటీలో ఉన్న ఓ వ్యక్తి తన నేరచరిత్రను దాచి పెట్టి ఎన్నికల కమిషన్ కు తప్పుడు అఫిడవిట్ ఇచ్చాడని ఆధారాలతో సహా మరో అభ్యర్థి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరపాలని జిల్లా అధికారులకు హైకోర్టు నోటీసులు ఇచ్చింది. ఇప్పుడు ఈ అంశం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.
News December 5, 2025
పాఠశాలలో భోజనం చేసిన అన్నమయ్య కలెక్టర్

కలెక్టర్ నిశాంత్ కుమార్ సిబ్యాలలోని ప్రభుత్వ ఏపీ మోడల్ స్కూల్, జూనియర్ కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్కూల్లో నిర్వహించిన మెగా PTMలో కలెక్టర్ పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్ విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో కలిసి భోజనం చేశారు. విద్యార్థులతో కలిసి భోజనం చేస్తున్న సమయంలో పిల్లలతో మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల పనితీరును అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలన్నారు.


