News March 7, 2025

మహిళా సదస్సు ఏర్పాట్లపై సీఎస్ శాంతికుమారి సమీక్ష

image

ఈ నెల 8న పరేడ్ గ్రౌండ్‌లో జరగనున్న మహిళా సదస్సు ఏర్పాట్లను బుధవారం సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అధికారులతో సమావేశమై సమీక్షించారు. ఈ సమావేశంలో వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సదస్సు అవసరమైన ఏర్పాట్లు, భద్రతా చర్యలు, వసతులు తదితర అంశాలను చర్చించారు. జిల్లాల నుంచి వచ్చే బస్సులకు బైసన్‌పోల్ మైదానంలో పార్కింగ్ ఏర్పాటు చేయాలని, మహిళలకు మజ్జిగప్యాకెట్లు అందించాలన్నారు.

Similar News

News March 20, 2025

బాలం రాయి హై స్కూల్‌ను సందర్శించిన మంత్రి, కలెక్టర్

image

విద్యారంగం ప్రాముఖ్యతను గుర్తించి ప్రభుత్వం విద్యపై ప్రత్యేక దృష్టి సారించిందని HYD ఇన్‌‌ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సికింద్రాబాద్ నల్లగుట్ట బాలంరాయి హైస్కూల్​లో ఎఫ్ఎల్ఎన్, ఏఎక్సెల్ ఏఐ ఆధారిత కంప్యూటర్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్‌లను కలెక్టర్‌తో కలసి పరిశీలించారు. పదో తరగతి పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించాలని విద్యార్థులకు సూచించారు. కలెక్టర్​ అనుదీప్​ దురిశెట్టి, DEO ఉన్నారు.

News March 20, 2025

HYDలో బొట్టు పెట్టుకున్న విశ్వ సుందరి!

image

మిస్ వరల్డ్ క్రిస్టినా పిస్కోవా బేగంపేటలో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. మధ్యాహ్నం 12:00 గంటలకు హోటల్ టూరిజం ప్లాజాలో మిస్ వరల్డ్ –2025 ప్రీ-లాంచ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలంగాణ సంప్రదాయంలో చీర కట్టు, బొట్టు పెట్టుకొని జ్యోతి ప్రజ్వలన చేశారు. ‘నమస్తే ఇండియా’ అని పలకరించి అందరినీ ఆకట్టుకున్నారు. ఇక్కడి ట్రెడిషన్ చాలా బాగా నచ్చింది అంటూ కితాబిచ్చారు.

News March 20, 2025

HYD: ఓయూలో తగ్గేదే లే!

image

ఓయూలో మళ్లీ ఆందోళనలు మొదలయ్యాయి. నిరసనలు నిషేధం అన్న సర్క్యూలర్‌ అగ్గిరాజేసింది. ఉమ్మడి రాష్ట్రంలో లేని ఆంక్షలు ఇప్పుడు పెట్టడం ఏంటని విద్యార్థి సంఘాలు భగ్గుమన్నాయి. వామపక్షాలు నేడు బంద్‌కు పిలుపునివ్వడంతో విద్యార్థులు మళ్లీ రోడ్డెక్కారు. ఇది నిబంధన కాదు నిర్బంధం అంటూ గొంతెత్తారు. వెనక్కి తగ్గేదేలే అంటున్నారు. ఇక అధికారులూ బెట్టు వీడకపోవడంతో పోలీసులు రంగప్రవేశం తప్పడం లేదు. దీనిపై మీ కామెంట్?

error: Content is protected !!