News March 13, 2025

మహిళా సాధికారతకు తోడ్పడాలి: అదనపు కలెక్టర్

image

మహిళలు ఎదిగితే సమాజం అభివృద్ధి చెందుతుందని, మహిళలు అన్ని రంగాల్లో ముందు ఉంది మహిళా సాధికారతకు తోడ్పడాలని అదనపు కలెక్టర్ గంగాధర్ అన్నారు. కలెక్టరెట్ సమావేశ మందిరంలో స్త్రీ, శిశు సంక్షేమ, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలకు హాజరై మాట్లాడారు. అధికారులు మహిళలు పాల్గొన్నారు.

Similar News

News March 11, 2026

చైనా FDIలు.. వ్యూహాత్మక గాలమా?

image

గల్వాన్ ఘర్షణ తర్వాత టిక్‌టాక్ బ్యాన్, చైనా వస్తువుల బహిష్కరణతో దేశం హోరెత్తిపోయింది. కానీ నేడు సీన్ మారింది. చైనా కంపెనీల <<19346681>>పెట్టుబడులకు<<>> (FDI) కేంద్రం రూల్స్ మార్చింది. ఇది వ్యూహాత్మక మార్పా? లేక ఆర్థిక అవసరమా? అనే చర్చ జరుగుతోంది. దేశీయ తయారీ రంగం బలోపేతం కోసం డ్రాగన్‌తో చేతులు కలిపిందని పలువురు విశ్లేషిస్తున్నారు. అలాగే చైనాను దారితెచ్చుకోవడానికి వేసిన గాలం అని మరికొందరు అంటున్నారు.

News March 11, 2026

పిఠాపురం: మద్యం మత్తులో ఘర్షణ.. బీరు బాటిల్‌తో దాడి

image

పిఠాపురం పట్టణంలోని ఇందిరానగర్‌లో మద్యం మత్తులో జరిగిన గొడవలో ఓ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. తాపీ పని చేసే కొంగాడి నానిబాబు, కూరపాటి శ్రీను మధ్య వాగ్వాదం జరుగుతుండగా, మధ్యలోకి వచ్చిన చిన్నారావు బీరు బాటిల్‌తో నానిబాబుపై దాడి చేశాడు. తీవ్ర గాయాలైన బాధితుడిని కాకినాడ ఆస్పత్రికి తరలించారు. సీఐ శ్రీనివాస్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News March 11, 2026

అమరావతికి వెళ్లిన చిత్తూరు కలెక్టర్

image

సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో నేడు, రేపు కలెక్టర్ల కాన్ఫరెన్స్ జరగనుంది. ఇందులో భాగంగా చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్ మంగళవారం అమరావతికి వెళ్లారు. కలెక్టర్ తిరిగి వచ్చే వరకు జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్ ఇన్‌ఛార్జ్ కలెక్టర్‌గా వ్యవహరించనున్నారు. ఈ నెల 13 నుంచి సుమిత్ కుమార్ ప్రజలకు అందుబాటులో ఉండనున్నారు.