News April 6, 2024

మహిళ ఉద్యోగిపై సెక్రటరీ వేధింపులు

image

తొర్రూరు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘంలో మహిళ పనిచేస్తుండగా.. అందులో సెక్రటరీగా పనిచేస్తున్న వెలుగు మురళి వ్యక్తి ఆమెను వేధిస్తున్నాడని పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కొన్నిరోజులుగా మహిళపై మనసుపడ్డానని మురళి ఆమెను వేధించేవాడు. తాజాగా అవి ఎక్కువవడంతో బాధిత మహిళ పోలీసులను ఆశ్రయించింది. దీంతో మురళిపై SC, ST కేసు నమోదు చేసినట్లు ఎస్సై జగదీశ్ తెలిపారు.

Similar News

News October 25, 2025

పర్వతగిరి: గిరాకీ లేదు.. వైన్ షాప్ ఎత్తేయండి..!

image

తమ పరిధిలోని ఒక వైన్ షాప్‌నకు గిరాకీ లేదని, షాప్ ఎత్తేయాలని ఏకంగా ఎక్సైజ్ అధికారులే ఉన్నతాధికారులకు ప్రతిపాదించారు. అదేంటీ.. వైన్ షాపులకు వాస్తు లేకున్నా గిరాకీ ఫుల్లుగా ఉంటుంది కదా అని ఆశ్చర్యపోతున్నారా..? కానీ ఇది నిజం. పర్వతగిరి మండలంలోని చింత నెక్కొండ గ్రామంలో గల వైన్ షాపు టార్గెట్ చేరుకోలేదని షాపును తొలగించారు. దీంతో మండలంలో 6 వైన్ షాపులు ఉండగా.. ప్రస్తుతం ఒకటి తొలగించడంతో ఐదుకు తగ్గింది.

News October 25, 2025

వరంగల్ కలెక్టరేట్‌లో స్పెషల్ గ్రీవెన్స్

image

వరంగల్ కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లాలోని దివ్యాంగులు, వయోవృద్ధులకు శనివారం స్పెషల్ గ్రీవెన్స్ నిర్వహించనున్నట్లు మహిళా, శిశు, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ అధికారి రాజమణి తెలిపారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 వరకు కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో స్పెషల్ గ్రీవెన్స్ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

News October 25, 2025

వరంగల్: గుర్తింపు, హరిత నిధుల ఫీజులు చెల్లించాలి..!

image

జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ యాజమాన్యాల కళాశాలలు గుర్తింపు ఫీజుతోపాటు హరితనిధి చెలించాలని డీఐఈవో డా.శ్రీధర్ సుమన్ పేర్కొన్నారు. ఇంటర్ బోర్డు వెబ్సైట్‌లో సంబంధిత కాలేజీ లాగిన్ ద్వారా గుర్తింపు ఫీజు తప్పక చెల్లించాలని సూచించారు. ప్రథమ సంవత్సరం విద్యార్థులు రూ.220, హరితనిధి రూ.15 కలిపి మొత్తం రూ.235 చొప్పున చెల్లించాలన్నారు. విద్యార్థుల పూర్తి వివరాలను ఆన్‌లైన్ చెక్ లిస్టులతో చూడాలన్నారు.