News April 6, 2024
మహిళ ఉద్యోగిపై సెక్రటరీ వేధింపులు
తొర్రూరు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘంలో మహిళ పనిచేస్తుండగా.. అందులో సెక్రటరీగా పనిచేస్తున్న వెలుగు మురళి వ్యక్తి ఆమెను వేధిస్తున్నాడని పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కొన్నిరోజులుగా మహిళపై మనసుపడ్డానని మురళి ఆమెను వేధించేవాడు. తాజాగా అవి ఎక్కువవడంతో బాధిత మహిళ పోలీసులను ఆశ్రయించింది. దీంతో మురళిపై SC, ST కేసు నమోదు చేసినట్లు ఎస్సై జగదీశ్ తెలిపారు.
Similar News
News January 22, 2025
WGL: తరలివచ్చిన పసుపు, పల్లికాయ.. ధరలు ఇలా..
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కు ఈరోజు పసుపు, పల్లికాయ తరలివచ్చింది. ఈ క్రమంలో క్వింటా పసుపు ధర రూ.12,112 పలికినట్లు అధికారులు తెలిపారు. అలాగే సూక పల్లికాయకి నిన్న రూ. 6100 ధర రాగా.. నేడు రూ.6200 ధర వచ్చింది. పచ్చి పల్లికాయ నిన్నటి లాగే రూ.4400 ధర పలికినట్లు వ్యాపారులు పేర్కొన్నారు.
News January 22, 2025
వరంగల్ మార్కెట్లో ఉత్పత్తుల ధరల వివరాలు
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో వివిధ రకాల ఉత్పత్తుల ధరలు ఇలా ఉన్నాయి. క్వింటా మక్కలు(బిల్టీ) ధర నిన్న రూ. 2,535 పలకగా.. నేడు రూ.2,450కి పడిపోయింది. అలాగే, పాత తేజా మిర్చి ధర రూ.13,400, పాత 341 రకం మిర్చి ధర రూ.14,300, పాత వండర్ హాట్ మిర్చి రూ.14,500, 5531 మిర్చి రూ.12వేలు పలికినట్లు అధికారులు పేర్కొన్నారు.
News January 22, 2025
కొత్తగూడ: కొడుకు దశదిన కర్మ రోజే తల్లి మృతి
మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం బూర్గుంపులో విషాదం నెలకొంది. కొడుకు చనిపోయిన రోజుల వ్యవధిలోనే తల్లి మృతి చెందిన విషాద ఘటన చోటుచేసుకుంది. గట్టి నరేశ్ అనారోగ్యంతో పది రోజుల కిందట మృతి చెందాడు. ఆయన తల్లి యాకమ్మ కొన్ని రోజులుగా పక్షవాతంతో మంచాన పడింది. కొడుకు మృతితో మనస్తాపం చెందిన యాకమ్మ.. ఆయన దశదిన కర్మ రోజే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.