News October 27, 2024

మహిళ పట్ల దురుసు ప్రవర్తన.. వ్యక్తికి దేహశుద్ధి

image

మహిళ పట్ల దురుసుగా ప్రవర్తించిన వ్యక్తికి దేహశుద్ధి చేశారు. ఎమ్మిగనూరు పోలీస్ స్టేషన్‌ సమీపంలో అరువు మీద భార్యాభర్తలు కూర్చుని మాట్లాడుతుండగా.. అటుగా వెళ్లిన ఓ వ్యక్తి మద్యం మత్తులో మహిళ పట్ల దురుసుగా ప్రవర్తించాడు. భర్త అడ్డుకోవడంతో ఆ వ్యక్తి అక్కడి నుంచి పరారయ్యాడు. వెంటాడి పట్టుకుని బాధిత మహిళ, భర్త ఇద్దరు కలిసి అతడిని చితకబాది పోలీసులకు అప్పగించారు.

Similar News

News December 10, 2025

100 రోజులు ప్రచారం చేయండి: కలెక్టర్

image

బాల్య వివాహాల రహిత ఆంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దడమే మన లక్ష్యమని కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి అన్నారు. బుధవారం కర్నూలు కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాలులో ఏఎస్పీ హుస్సేన్ పీరాతో కలిసి బాల్య వివాహాలపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. బాల్యవివాహాల నిర్మూలన కోసం జిల్లా వ్యాప్తంగా 100 రోజులు నిర్విరామంగా ప్రచారాలు చేయాలని అధికారులను ఆదేశించారు.

News December 10, 2025

పీజీఆర్‌ఎస్‌ మండల కార్యాలయాల్లోనే: కలెక్టర్

image

ప్రతి సోమవారం నిర్వహించే పీజీఆర్‌ఎస్‌ (ప్రజా సమస్యల పరిష్కారం) కార్యక్రమాన్ని మండల తహశీల్దార్ కార్యాలయాల్లోనే కొనసాగిస్తున్నామని కర్నూలు జిల్లా కలెక్టర్ డా.ఎ.సిరి తెలిపారు. ప్రజలు సుదూర ప్రాంతాల నుంచి జిల్లా కేంద్రానికి రావాల్సిన అవసరం లేదని, సమస్యలను లిఖితపూర్వకంగా మండల కార్యాలయంలో ఇస్తే రసీదు జారీ చేసి గడువులోగా పరిష్కారం చూపుతామని స్పష్టం చేశారు.