News March 14, 2025
మహిళ రక్షణకు శక్తి యాప్ ఒక ఉక్కు కవచం: తిరుపతి SP

మహిళ రక్షణకు శక్తి యాప్ ఒక ఉక్కు కవచమని తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. ఆయన మాట్లాడుతూ..ప్రతి ఒక్క మహిళ మొబైల్ లో “శక్తి” యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆపద సమయంలో పోలీసు వారి సహాయం పొందాలన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా మహిళలు, బాలికల భద్రత కొరకు శక్తి యాప్ (SHAKTI App) ను రూపొందించిందని తెలిపారు.
Similar News
News November 26, 2025
పల్నాడు: భారంగా మారిన పశుగ్రాసం..!

పల్నాడులో ఎక్కువగా వరి కోతకు యంత్రాలు వాడటం వలన వరిగడ్డి చిన్న ముక్కలై పొలంలోనే ఉండిపోవడంతో పశుపోషకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రాసం దొరకని పరిస్థితి నెలకొనడంతో, పశువులకు గడ్డి అందించడం భారంగా మారింది. దీంతో మిర్యాలగూడ వంటి దూర ప్రాంతాల నుంచి అధిక ధరలకు వరిగడ్డిని కొనుగోలు చేస్తున్నారు. ఒక్కో ట్రాక్టర్ వరిగడ్డికి సుమారు రూ.15 వేలు ఖర్చవుతోందని రైతులు చెబుతున్నారు.
News November 26, 2025
బాలిస్టిక్ క్షిపణి పరీక్షించిన పాకిస్థాన్

యాంటీ షిప్ బాలిస్టిక్ క్షిపణిని విజయవంతంగా ప్రయోగించినట్లు పాకిస్థాన్ మిలిటరీ ప్రకటించింది. ‘స్థానికంగా నిర్మించిన నేవల్ ప్లాట్ఫామ్ నుంచి మిస్సైల్ పరీక్షించాం. సముద్రం, భూమిపై ఉన్న లక్ష్యాలను ఇది అత్యంత కచ్చితత్వంతో ఛేదించగలదు. ఇందులో అత్యాధునిక గైడెన్స్ వ్యవస్థలు ఉన్నాయి’ అని పేర్కొంది. కాగా మే నెలలో భారత్ నిర్వహించిన ఆపరేషన్ సిందూర్ తర్వాతి నుంచి పాకిస్థాన్ ఈ తరహా ప్రయోగాలను పెంచింది.
News November 26, 2025
ఏలూరు: రాజ్యాంగ పీఠికపై ప్రమాణం

ఏలూరు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ భవనంలో బుధవారం రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా స్థానిక న్యాయమూర్తులు, కోర్టు సిబ్బంది, న్యాయవాదులు రాజ్యాంగ పీఠికను అనుసరిస్తామని ప్రమాణం చేశారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్. శ్రీదేవి మాట్లాడుతూ.. జాతీయ న్యాయదినోత్సవాన్ని ప్రతి సంవత్సరం నవంబర్ 26న జరుపుకుంటామన్నారు. భారత రాజ్యాంగంపై యువతకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత అందరిపై ఉందని తెలిపారు.


