News March 14, 2025

మహిళ రక్షణకు శక్తి యాప్ ఒక ఉక్కు కవచం: తిరుపతి SP

image

మహిళ రక్షణకు శక్తి యాప్ ఒక ఉక్కు కవచమని తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. ఆయన మాట్లాడుతూ..ప్రతి ఒక్క మహిళ మొబైల్ లో “శక్తి” యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆపద సమయంలో పోలీసు వారి సహాయం పొందాలన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా మహిళలు, బాలికల భద్రత కొరకు శక్తి యాప్ (SHAKTI App) ను రూపొందించిందని తెలిపారు.

Similar News

News April 22, 2025

మోమిన్ పేట్: SC హాస్టల్ తనిఖీ చేసిన కలెక్టర్

image

మోమిన్ పేట్ మండలోని SC హాస్టల్‌ను కలెక్టర్ ప్రతిక్ జైన్ తనిఖీ చేశారు. హాస్టల్‌లో మౌలిక సదుపాయాలు, నాణ్యమైన ఫుడ్ అందించాలని సూచించారు. వాటర్ సమస్య రాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. వారితో పాటు అడిషనల్ కలెక్టర్ లింగ్య నాయక్, ఆర్డీవో వాసు చంద్ర, మర్పల్లి మార్కెట్ ఛైర్మన్ మహేందర్ రెడ్డి, ఎంపీడీవో విజయలక్ష్మి, నరోత్తం రెడ్డి, తదితరులు ఉన్నారు.

News April 22, 2025

HEADLINES TODAY

image

‣‣ AP: గ్రూప్-1 మెయిన్స్ షెడ్యూల్, హాల్ టికెట్ల విడుదల,
‣‣ AP: ఏపీ పోలీసుల అదుపులో రాజ్ కసిరెడ్డి
‣‣ AP: 23న పదో తరగతి పరీక్ష ఫలితాలు
‣‣ TG: రేపు ఇంటర్ ఫలితాలు
‣‣ TG: జపాన్ పారిశ్రామిక వేత్తలతో సీఎం రేవంత్ భేటీ
‣‣ TG: లగచర్ల ఘటనలో NHRC నివేదిక కూడా మేం చెప్పినట్లే వచ్చింది: కేటీఆర్
‣‣ రూ.లక్షకు చేరిన బంగారం ధర
‣‣ ప్రధాని మోదీతో జేడీ వాన్స్ దంపతుల భేటీ

News April 22, 2025

హారన్ నొక్కితే ఫ్లూట్, తబలా, వయోలిన్ సౌండ్స్?

image

హారన్ నొక్కితే వాయిద్య పరికరాల శబ్దాలు వస్తే ఎలా ఉంటుంది? దేశంలో శబ్ద కాలుష్యాన్ని తగ్గించేందుకు ఇదే ఆలోచనను అమలుచేయాలని భావిస్తున్నట్లు జాతీయ రహదారుల శాఖా మంత్రి గడ్కరీ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. హారన్ కొట్టినా వినేందుకు వినసొంపుగా ఉండేలా కొత్త చట్టాన్ని తీసుకువద్దామనుకుంటున్నట్లు వెల్లడించారు. హార్మోనియం, ఫ్లూట్, తబలా వంటి పరికరాల శబ్దాల్ని పెట్టించాలని యోచిస్తున్నట్లు పేర్కొన్నారు. మీ అభిప్రాయం?

error: Content is protected !!