News August 31, 2024
మహిళ శక్తి పథకాన్ని పటిష్టంగా చేపట్టాలి: కలెక్టర్

ఇందిర మహిళా శక్తి పథకం క్రింద చేపట్టిన వివిధ యూనిట్లను లబ్దిదారులకు అందజేసేందుకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని ఖమ్మం కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారులతో ఇందిర మహిళా శక్తి యూనిట్లపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. అధికారులు క్షేత్రస్థాయిలో ఉంటూ మండల వారిగా మహిళ శక్తి పథకం కార్యచరణ చేపట్టాలన్నారు.
Similar News
News October 3, 2025
ఎర్రుపాలెం: మనవడి చేతిలో అమ్మమ్మ హత్య..?

ఎర్రుపాలెం మండలం సకినవీడు గ్రామంలో దారుణ హత్య జరిగింది. గ్రామానికి చెందిన శాఖమూరి పద్మ (60)ను ఆమె మనవడు శాఖమూరి చీరాల సాయి శుక్రవారం హతమార్చినట్లు చర్చించుకుంటున్నారు. పద్మ నిద్రిస్తుండగా ఈ ఘటన జరిగిందని స్థానికులు చెబుతున్నారు. హత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
News October 1, 2025
‘ఎన్నికల విధులను పకడ్బందీగా నిర్వహించాలి’

ఖమ్మం: ఎన్నికల విధులను పకడ్బందీగా నిర్వహించాలని మాస్టర్ ట్రైనర్/ జిల్లా ఉపాధి కల్పన అధికారి శ్రీరామ్ అన్నారు. బుధవారం డీపీఆర్సీ భవనంలో నోడల్ అధికారులు, రిటర్నింగ్ అధికారులకు, మాస్టర్ ట్రైనర్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రతి ఒక్కరు తమకు కేటాయించిన హ్యండ్ బుక్ ఒకటికీ రెండుసార్లు పరిశీలించాలని, ముఖ్యమైన నిబంధనలు మార్క్ చేసి పెట్టుకోవాలని సూచించారు.
News October 1, 2025
హోంగార్డు కుటుంబానికి బీమా చెక్కు అందజేత: CP

గతేడాది మాదారం నుంచి ఖమ్మం విధులకు వెళ్తున్న ఖమ్మం యూనిట్కు చెందిన హోంగార్డు చందర్ రోడ్డు ప్రమాదంలో మరణించారు. కాగా హోంగార్డు కుటుంబానికి యాక్సెస్ బ్యాంక్ సాలరీ అకౌంట్తో వచ్చే ప్రయోజనాలు, ప్రమాద బీమా సొమ్ము రూ.34 లక్షల చెక్కు మంజూరైంది. బుధవారం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ హోంగార్డు కుటుంబ సభ్యులకు చెక్కును అందజేశారు.