News August 31, 2024
మహిళ శక్తి పథకాన్ని పటిష్టంగా చేపట్టాలి: కలెక్టర్

ఇందిర మహిళా శక్తి పథకం క్రింద చేపట్టిన వివిధ యూనిట్లను లబ్దిదారులకు అందజేసేందుకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని ఖమ్మం కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారులతో ఇందిర మహిళా శక్తి యూనిట్లపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. అధికారులు క్షేత్రస్థాయిలో ఉంటూ మండల వారిగా మహిళ శక్తి పథకం కార్యచరణ చేపట్టాలన్నారు.
Similar News
News February 8, 2025
బాలుడి మర్మాంగాన్ని కోరికిన పెంపుడు కుక్క..!

ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో దారుణ ఘటన జరిగింది. కుంట గ్రామానికి చెందిన ఏడేళ్ల బాలుడు లక్ష్మయ్య ఇంట్లో నిద్రిస్తుండగా వారు పెంచుకునే కుక్క మర్మాంగాన్ని కొరికింది. కుటుంబీకులు బాలుడిని భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించారు. వైద్యులు బాలుడి మర్మాంగానికి శస్త్రచికిత్స చేశారు. ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగానే ఉందని ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ రామకృష్ణ తెలిపారు.
News February 8, 2025
ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

∆} ఖమ్మంలో ఎంపీ రామ సహాయం రఘురాం రెడ్డి పర్యటన∆} సత్తుపల్లిలో విద్యుత్ సరఫరాలో అంతరాయం∆} ఖమ్మం జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన ∆} ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కు మార్కెట్‌కు వివిధ శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం ∆} వైరాలో ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పర్యటన ∆} మధిరలో అంతరాయం
News February 8, 2025
రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

<<15391662>>కర్మకు వెళ్లి వస్తుండగా<<>> బూడిదంపాడు వద్ద రోడ్డు ప్రమాదంలో వీరబాబు, విజయ్ మృతి చెందిన విషయం తెలిసిందే. విజయ్‌కు భార్య, 3 కుమారులు, వీరబాబుకు భార్య, ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. వీరబాబు మొదటి భార్యకు కుమార్తె జన్మించాక 8ఏళ్ల క్రితం కన్నుమూయడంతో మరో వివాహం చేసుకున్నాడు. కుమార్తెకు పెళ్లి నిశ్చయం కాగా ఇటీవలే ముహూర్తాలు కూడా ఖరారు చేసుకున్నారు. ఇంతలోనే ఆయన మృతి చెందడంతో కుటుంబంలో విషాదం నెలకొంది.